Big Boss OTT:బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లలో పూర్తిచేసుకుని నేడు ఈ కార్యక్రమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది.
24 గంటల పాటు ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి సిద్ధమైంది. ఇకపోతే ఈ కార్యక్రమంలోకి ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లతో పాటు మరికొంతమంది యూట్యూబర్స్, యాంకర్స్, సీరియల్ ఆర్టిస్ట్ లు పాల్గొనబోతున్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
17 మంది కంటేస్టెంట్లతో ఈ కార్యక్రమాన్ని మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎంట్రీ ఇవ్వనున్న ఫైనల్ కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ ఓ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయానికి వస్తే..
అరియానా, యాంకర్ శివ అఖిల్ సార్థక్, సరయు, తేజస్వి మదివాడ, మహేష్ విట్టా, అషు రెడ్డి ఫస్ట్ ఎంట్రీ,హమీదా, నటరాజ్ మాస్టర్, నిఖిల్, మిత్రా శర్మ,ముమైత్ ఖాన్, ఆర్జే చైతు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, అజయ్ కతుర్వార్ ప్రస్తుతం వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈసారి సీక్రెట్ రూమ్ కాకుండా కంటెస్టెంట్స్ అందరిని ఒకేసారి హౌస్ లోకి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండనున్నట్లు సమాచారం.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…