Sunil Shetty: ఇలాంటి వార్తలు రాసే బదులు అడుక్కోండి డబ్బులు వస్తాయ్…. రెచ్చిపోయిన కమెడియన్ సునీల్ శెట్టి!
Sunil Shetty: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు సునీల్ శెట్టి ఒకరు.ఈయన గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో తెలుగు తమిళ కన్నడ భాషలలో పలు చిత్రాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో కాస్త సినిమా అవకాశాలు తగ్గడంతో చాలామంది సునీల్ శెట్టికి ఇండస్ట్రీ లో అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీ వదిలి తిరిగి వైజాగ్ వెళ్లి ఒక షాప్ నిర్వహిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ శెట్టి ఈ వార్తలపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు.
ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి నా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తల పై తాను చాలా బాధపడ్డాను అని ఈ విషయంలో నేను ఎక్కడికైనా వెళ్లి వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.నేను ఇండస్ట్రీ వెళ్లి వైజాగ్ లో షాప్ పెట్టుకోవడం మీకు చెప్పి వెళ్ళనా ఇలా ఏది పడితే అది రాస్తే ఎలాగా… ఈ విషయం మా కుటుంబంలో తెలిస్తే వాళ్లు ఎంత బాధపడతారు మీకు అర్థం అవుతుందా అంటూ ఆయన రెచ్చిపోయారు.
ఈ కళామతల్లిని నమ్ముకుని ఇక్కడే బతుకుతున్నాం బయటకు వెళితే మాకు వేరే పని చేయడం రాదు మాకు తెలిసిన పని నటన మాత్రమేనని సునీల్ శెట్టి ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు. ఏ పని పాట లేని లం* కొడుకులు ఇలాంటి వార్తలన్నీ రాస్తారు ఇలాంటివి రాసే బదులు అడుక్కోండి కాసిన్ని డబ్బులు అయినా వస్తాయి అంటూ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన గురించి తప్పుడు వార్తలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నేను ఇప్పటికి ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నానని అయితే అప్పుడు అన్ని అవకాశాలు కాకపోయినా ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నానని, ప్రాణం పోయే వరకు ఇండస్ట్రీలోనే ఉంటాను అని ఈ సందర్భంగా సునీల్ శెట్టి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…