Featured

Big boss Vasanthi Krishnan : బిగ్ బాస్ వాసంతి కృష్ణన్ ఎంగేజ్మెంట్… అర్జున్ కళ్యాణ్ పడేసాడు… పెళ్లి కొడుకు ఎవరంటే…: వాసంతి కృష్ణన్

Big boss Vasanthi Krishnan : మోడలింగ్ తో మొదలై, కన్నడ సినిమాలను చేసి మళ్ళీ తెలుగు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన తెలుగమ్మాయి వాసంతి కృష్ణన్. తిరుపతికి చెందిన వాసంతి ప్లస్ టూ తరువాత డిగ్రీ కోసం బెంగళూరు వెళ్లి పైలట్ అవ్వాలని అనుకుంది. ఆ తరువాత యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులేసి కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మోడలింగ్ చేస్తూ ఆ తరువాత సినిమాల్లో హీరోయిన్ గా కొన్ని కన్నడ సినిమాలు చేసిన వాసంతి తెలుగు ఇండస్ట్రీకి మా టీవీ ద్వారా అడుగుపెట్టింది. తెలుగులో సిరిసిరి మువ్వ, గుప్పెడంత మనసు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వాసంతి బిగ్ బాస్ తరువాత లైఫ్ మారి పోయిందంటూ చెప్తోంది. త్వరలో తన పెళ్లి అని షాక్ ఇచ్చిన ఈ అమ్మడు నిజంగా పెళ్లి చేసుకుంటోందా లేక ప్రాంక్ చేస్తోందా…

ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న వాసంతి… పెళ్లి త్వరలో…

బిగ్ బాస్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న వాసంతి ప్రస్తుతం అటు సినిమాల వైపు ఇటు బుల్లితెర మీద షోస్ తో సందడి చేస్తోంది. ప్రస్తుతం బిబి జోడితో సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే మరి వరుడు ఎవరు, అపుడే పెళ్లి, అదీ ఎవరికీ చెప్పకుండా అని అడిగితే ఇదంతా ప్రాంక్ అంటూ చెప్పింది. తాను నటిస్తున్న సీరియల్ ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడుతున్నారు’ ప్రమోషన్స్ కోసం ఇలా ప్రాంక్ చేశానంటూ చెప్పి షాక్ ఇచ్చింది.

ఇక ఆ సీరియల్ కోసం పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న వాసంతి ప్రస్తుతం కేరర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని, పెళ్లి గురించి ఇప్పుడే ఎలాంటి ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక బిబి జోడిలో అర్జున్ కళ్యాణ్ తో డాన్స్ ప్రాక్టీస్ చేసేటపుడు చాలా సార్లు అర్జున్ పడేసాడంటూ చెప్పి మొదట్లో కొంత తడబడినా ఇప్పుడు డాన్స్ మాస్టర్ తో కనెక్ట్ అయి డాన్స్ బాగా చేస్తున్నాం అంటూ బిబి జోడి కి మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయంటూ చెప్పింది. సీరియల్ ప్రొమోషన్స్ కోసం ప్రాంక్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది మరి వాసంతి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago