Varun -Charan: సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వరుణ్ తేజ్ అలాగే రామ్ చరణ్ తేజ్ ఒకరు. వీరిద్దరూ మధ్య ఎంతో అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ లో పెద్ద అబ్బాయి కావడంతో అందరి పట్ల చాలా బాధ్యతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ వరుణ్ మధ్య చిన్నప్పుడు పెద్ద ఎత్తున గొడవలు జరిగేవని తాజాగా వరుణ్ తేజ్ ఆ గొడవలను గుర్తుచేసుకొని మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 1వ తేదీ విడుదల కాబోతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరుణ్ తన అన్నయ్య చరణ్ తో చిన్నప్పుడు పడిన గొడవల గురించి పలు విషయాలు వెల్లడించారు. కెరీర్ మొదట్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పలు యాడ్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే చరణ్ పవన్ పార్టీ కాగా వరుణ్ పెదనాన్న చిరంజీవి పార్టీ.
పెదనాన్న ఉంటే సేఫ్…
పెదనాన్న చేసిన యాడ్స్ బాగున్నాయని వరుణ్ లేదు బాబాయ్ చేసిన యాడ్స్ బాగున్నాయని చరణ్ ఇద్దరు బాగా గొడవపడేవారట అయితే చిరంజీవి గారు ఇంట్లో ఉన్నప్పుడు తాను సేఫ్ అయ్యేవాడిని ఒకసారి పెదనాన్న బయటికి పోతే చరణ్ అన్న నాతో ఆట ఆడుకునేవారు అంటూ అప్పట్లో వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొడవలను గుర్తు చేసుకుంటూ వరుణ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…