Sakshi TV-CM Jagan: సీఎం జగన్ కు బిగ్ షాక్.. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత..?
Sakshi TV-CM Jagan: కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ రానందువల్ల సాక్షి టీవీ ఛానల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది. దీనిలో ఏముందంటే.. సాక్షి టీవీని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని 2021 డిసెంబర్ 31న ఆ సంస్థకు సమాచార శాఖ షో కాజ్ నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
అయితే ఆ నోటీసుకు సాక్షి టీవీ యాజమాన్యం బదులు సమాధానం కూడా ఇచ్చిందట. జనవరి 13, 2022న సాక్షి టీవీ ఛానల్ కు కేంద్ర హోంశాఖ ఎందుకు అనుమతులు ఇవ్వలేదో తమకు తెలియదని.. అయితే ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఇందిరా టెలివిజన్ కోరిందంట. క్లియరెన్స్ లేకుండా.. ఎలాంటి టీవీ ప్రసారాలకు అనుమనతిని పునరుద్ధరించలేమని చెప్పిందట.
అంతే కాకుండా.. ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కు అనుమతి జారీని రద్దు చేస్తున్నట్లు కూడా వివరించిందట. అనుమతించిన టీవీ ఛానళ్ల లిస్ట్ నుంచి సాక్షి టీవీని తొలగిస్తున్నట్లు తెలిపిందట.
అయితే దీని నుంచి తప్పించుకునేందుకు ఇందిరా టెలివిజన్ ఉద్యోగుల నుంచి హైకోర్టులో పిటిషన్ వేయించినట్లు తెలుస్తోంది.
అనుమతులు రద్దును సవాల్ చేస్తూ.. సిబ్బంది హైకోర్టుకు వెళ్లారు. ఈ టీవీలో పనిచేసే 600 మందికి ఉపాధి కరువు అవుతుందని.. రద్దు ఆదేశాలను కొట్టివేయాలని కోరారట. వీటిపై వాదోపవాదనలు విన్న తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేనెల 11వరకూ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది. అంతక ముందు కూడా ఇలాంటివి జరిగినట్లు కోర్టకు తెలిపారట. అయితే సెక్యూరిటీ క్లియరెన్స్ జగన్ మోహన్ రెడ్డి ఛానల్ అయిన సాక్షికి ఇవ్వకపోవడానికి కారణం.. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఉన్నందుకేనా.. అనే అనుమానాలు, ప్రశ్నలు తలెతుత్తున్నాయి. ఏదేమైనా సాక్షి టెలివిజన్ ప్రసారాలు ఇక ముందు కొనసాగుతాయా.. లేదా అనేది చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…