బుల్లితెర రియల్టీ షో ‘బిగ్ బాస్’ కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజీ ఉంది. బిగ్ బాస్-1, బిగ్ బాస్-2, బిగ్ బాస్-3 షోలతో నిర్వాహకులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో త్వరలోనే బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభించేందుకు షో నిర్వహాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంటెస్ట్ ఎంపిక కూడా ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 4 పై అంచనాలు పెంచేవిధంగా టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ లను రంగంలోకి దింపుతున్నారు. ఈసారి బిగ్ బాస్ షో చాలా హాట్ ఉండబోతుందని, టాలీవుడ్ లో తమ అందాల ఆరబోతతో అదరగొట్టిన భామలు ఈ షోలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు, హీరోయిన్లు పూనమ్ భజ్వా, శ్రద్ధాదాస్, హంసా నందినిలు ఈ షోకు ఎంపికైనట్లు తెలిసింది.ఇక అసలు విషయానికి వస్తే.. తెలుగు, తమిళంలో పునమ్ భజ్వాకు మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్, బాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రద్ధా దాస్, ఐటమ్ సాంగ్స్ ద్వారా గా పేరు తెచ్చుకున్న హంసా నందినిలు బిగ్ బాస్-4లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ హాట్ బ్యూటీలతో బిగ్ బాస్ సీజన్ 4 వస్తుండటంతో భారీ అంచనాలతోనే వున్నారు ప్రేక్షకులు. 12 మంది కంటెస్ట్ లతోపాటు నలుగురు వైల్డ్ కార్డు ఎంట్రీలతో మొత్తం 16 మంది కంటెస్ట్ లతో బిగ్ బాస్-4 సీజన్ ఉండబోతుందని సమాచారం. వీరిలో బిత్తిరి సత్తి, సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రమేష్ పేర్లు కాన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో బిగ్ బాస్-4 ప్రారంభించేందుకు షో నిర్వహాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ సెట్ ను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది. సీజన్ 4 కు హోస్ట్ గా కింగ్ నాగార్జున వుండబోతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 షోకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ షోలో పాల్గొంటున్న సినీ నటి పూనమ్ బజ్వా కు రెమ్యునరేషన్ గా ఏకంగా రూ .45 లక్షలు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. నటి పూనమ్ బజ్వా టాలీవుడ్ లో హాట్ గర్ల్ గా తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించింది. కొన్ని తమిళ సినిమాల్లో అయితే సంచలనమే సృష్టించింది. కానీ తెలుగులోనే సక్సెస్ ఫుల్ నటిగా ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. టాలీవుడ్ మూవీ ‘బాస్’ చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన 2వ కథానాయికగా నటించిన పూనమ్ లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 కోసం సంతకం చేసినట్లు షో నిర్వాహకులు తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…