Categories: FeaturedMovie News

రియల్ లైఫ్ లో హీరో సోనూ సూద్ రాజకీయాల్లోకి ఎంట్రీ పై… సోనూ ఏమన్నాడో తెలుసా ?!

సోనూసూద్ రీల్‌ లైఫ్‌లో విలన్‌.! ఎన్నో సినిమాలలో వెండితెరపై విలనిజాన్ని పండించాడు. విలనిజం అంటే అది అని చూపించాడు. ప్రేక్షకుల్లో అదే ముద్ర వేసుకున్నాడు. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం అతడు హీరో. ఈమధ్య కాలంలో అతను చేస్తున్న పనులే అతడికి సమాజంలో మంచి పేరును తెచ్చి పెట్టాయ్‌. ఇంతకీ సోనూసూద్‌ ఏం చేశాడు.? ఇంతలోనే అంత ఇమేజ్‌ ఎలా పొందగలిగాడు.?

సోనూ సూద్.. ఇది కేవలం పేరు కాదు. వలస కూలీల పాలిట దైవత్వం. కరోనా రక్కసి కోరల్లో చిక్కుకున్న వేలాదిమంది వలస కార్మికులకు దారి చూపించాడు. ఆపదలో ఉన్నామని ఎవరు సహాయం ఆర్ధించినా కాదనకుండా సహాయం చేశాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఎక్కడ.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయం చేసి అందరినీ ఆదుకుంటూ పేదల పాలిట పెన్నిధిగా మారాడు. సోనూ సూద్ ది వెన్నలాంటి మనసు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే కరిగి పోతాడు. ఆ కష్టం తనదే అన్నట్టుగా ఫీలవుతాడు. ఆపదలో ఉన్నానని ఎవరు సాయం కోరినా నేనున్నాను అంటూ క్షణాల్లో ఆదుకుని అండగా ఉంటాడు. కష్టంలో ఉన్న ఏ కుటుంబాన్ని చూసినా ఇట్టే చలించి పోతాడు. ఇదంతా ఎందుకు చదువుతున్నారంటే.. ప్రపంచం సాఫీగా సాగిపోతున్న సమయంలో కరోనా వైరస్ పెనుభూతంలా ప్రవేశించింది.

ప్రపంచ వ్యాప్తంగా రాత్రికి రాత్రే లాక్‌డౌన్ అమలు చేశారు. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచి పోయింది. వలస కార్మికులు.. నిరుపేదలు ఎక్కడివాళ్ళు అక్కడే స్తంభించి పోయారు. చెయ్యడానికి పనిలేదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు. సొంత ఊరికి వెళ్దామంటే రవాణా సౌకర్యం లేదు. ఇలా వలస కూలీల అవస్థలు అన్నీ చూసి చలించిపోయిన సోనూసూద్‌ పెద్ద మనుసు చేసుకుని కూలీలను తన స్వంత డబ్బులతో వారి స్వస్థలాలకు పంపించాడు. ప్రభుత్వాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్ధలు కూడా చేయలేని పనిని క్షణంలో ఎంతో ధైర్యంతో ఖర్చుకు వెనుకాడకుండా తన వంతు సహాయం చేశాడు. వలస కూలీల పాలిట దేవుడయ్యాడు. అంతే కాకుండా కరోనా మూలంగా చెల్లాచెదురైన జీవితాలను ఆదుకుని తన ఉదారతను చాటుకున్నాడు. రాజకీయ నాయకులందరిలాగ.. సినిమా సెలబ్రిటీల్లాగ కేవలం ట్వీట్లు.. ఉపన్యాసాలకు పరిమితం కాకుండా ఆపద సమయంలో చేయందించి రియల్ హీరోగా అనిపించుకున్నాడు.

తన వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలనే సత్సంకల్పంతో ముందడుగు వేశాడు. కరోనా మహమ్మారి వలన చాలామంది చనిపోవడం చూసి కలత చెందాడు. సోనూ సూద్ ఎప్పుడూ అవార్డుల కోసమో, గుర్తింపు కోసమో ప్రయత్నించలేదు. వేలాదిమందికి ఉపాధి కల్పించాలనే మంచి ఆశయంతోనే ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు. దీంతో సోనుసూద్ పేరు ఒక్కసారిగా దేశం మొత్తం మారు మ్రోగిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సోనూసూద్ రాజకీయాల్లో రావడానికి ట్రై చేస్తున్నారని కొన్ని పార్టీలకు చెందిన నాయకులు ఆయనపై సెటైరికల్ గా విమర్శలు చేయడం జరిగింది. లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ కి ప్రత్యేకమైన బస్సులు ఎవరిచ్చారని, ఏ ప్రభుత్వం అండగా ఉందంటూ రకరకాలుగా కామెంట్స్ షేర్ చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఓ ప్రముఖ టీవీ ఛానల్ సోనూ సూద్ ని ఇంటర్వ్యూ చేస్తూ.. ‘భవిష్యత్ లో మీకు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచన ఏమైనా వుందా.?’ అనడిగారు. ఆ ప్రశ్నకు స్పందించిన సోనూ సూద్ పొలిటికల్ ఎంట్రీ గురించి తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘తనకు రాజకీయ రంగం అంటే ఇష్టం లేదని, ఇప్పటికే అనేక అవకాశాలు వచ్చాయి కానీ తనకు సినిమా రంగం అంటేనే ఇష్టమని, అలాగే తనకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ప్రధాని మోడీ’ అని తెలియజేశారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago