ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారి సామాన్య ప్రజలనే కాకుండా సినీ రంగ ప్రముఖులను కూడా వదలడం లేదు. తాజాగా హీరో విశాల్ కుటుంబం కూడా కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తమిళ హీరో విశాల్ తన ట్విటర్ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. ‘అవును. ఆ వార్తలు నిజమే. మా నాన్న జికే రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆయనకి హెల్ప్ చేసేటప్పుడు నాకు కూడా జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపించాయి. ఇవే లక్షణాలు మా మేనేజర్ హరిలో కూడా ఉన్నాయి. మేమంతా ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకుంటున్నాము. ఒక వారంలో కరోనా వైరస్ బారి నుండి బయటపడ్డాము. ప్రస్తుతానికి మా ఆరోగ్యం బాగానే ఉంది. గుడ్ బై’ అని విశాల్ తన ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఈమధ్య విశాల్ ను చూసిన వాళ్ళందరూ ‘వామ్మో..! విశాల్ ఏంటి ఇలా మారిపోయాడు’ అంటున్నారు. ఇదిలా వుండగా.. లేటెస్ట్ గా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులలో మనోధైర్యాన్ని కలిగించే విధంగా విశాల్ ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోను చూసిన విశాల్ ఫ్యాన్స్ అందరూ ‘అన్నా.! నువ్వు రియల్ హీరో’ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఎలాంటి భయం అవసరం లేదని.. అసలు భయపడాల్సిన పనే లేదని, అలాగే కరోనా పరీక్షలు చేసిన తర్వాత కూడా ఫలితాల కోసం టెన్షన్ పడొద్దని, కరోనా పాజిటివ్ వచ్చిన తన తండ్రి జికె రెడ్డి గురించి జాగ్రత్తలు తీసుకుంటుంటే తనకు కూడా అవే లక్షణాలు కనిపించాయని.. శరీర ఉష్ణోగ్రత 100-103కి పైగా ఉందని, తర్వాత రోజు దగ్గు, జలుబు వచ్చిందని.. తన మేనేజర్ హరికి కూడా అవే లక్షణాలున్నాయని, తామందరం వెంటనే ఆయుర్వేదిక్, హోమియో పతి మెడిసిన్స్ వాడామని.. క్రమ పద్దతిలో మెడిసిన్స్ వాడుతూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో శరీర ఉష్ణోగ్రత, లక్షణాలు తగ్గుముఖం పట్టాయని, సెల్ఫ్ క్వారంటైన్లో ఉండటమే కాకుండా కరోనా నివారణకు అవసరమైన మెడిసిన్స్ కూడా వాడామని దాంతో వారం రోజుల్లోనే ఆరోగ్యంగా మారిపోయి మళ్ళీ యథాస్ధితికి వచ్చేశామని కాబట్టి కరోనా వచ్చినా కూడా ఎవరు భయపడాల్సిన పని లేదని విశాల్ ఆ వీడియో రూపంలో తెలియజేశాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…