స్టార్ మాలో టాప్ రేటింగ్స్ తో ప్రసారమౌతున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ మరి కొద్ది రోజులలో ముగుస్తుంది. మరో 5 రోజులలో ఈ సీజన్ ముగుస్తుండటంతో బిగ్ బాస్ విజేత ఎవరు అనే టెన్షన్ లో కంటెస్టెంట్ లు ఉన్నారు. అయితే వీరి టెన్షన్ తొలగించి కాసేపు వీరితో సరదాగా గడపడానికి బిగ్ బాస్ సీనియర్ కంటెస్టెంట్ లు హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ వచ్చారు. వీరందరూ ప్రత్యేక గదిలో ఉండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు హాయ్ చెబుతూ ఎంతో సరదాగా వారితో గడిపారు.
అయితే వీరందరూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు సరదాగా కొన్ని ప్రశ్నలు వేసి ఆట,పాటలతో ఎంతో సరదాగా గడిపారు. వీరిని ఆకట్టుకునేందుకు హౌస్ లో ఉన్న అభిజిత్ అందరూ ఎంతో బాగున్నారని చెప్పడంతో అందుకు హరితేజ మమ్మల్ని కూడా వదలవా అంటూ అభిజిత్ పై పంచులు వేసింది. ఇక శ్రీముఖి అఖిల్ తో మాట్లాడుతూ మోనాల్ వెళ్ళిపోయాక సైలెంట్ అయ్యావు ఏంటి అని తన బాధను పంచుకునే ప్రయత్నం చేస్తుండగా అంతలో సోహెల్ కలగజేసుకుని ఇక్కడున్న ఇద్దరమ్మాయిలకు సోప్ వేస్తున్నాడని సోహెల్ గురించి తెలియజేశాడు.
వీరి కేకలకు హరితేజ మాట్లాడుతూ గత సీజన్ లో మనల్ని లౌడ్ స్పీకర్ అనేవారు. కానీ మన కన్నా పెద్ద లౌడ్ స్పీకర్ ఇక్కడ ఉందంటూ అరియానను చూపించారు.అనంతరం శ్రీముఖి నిన్ను పెళ్లి చేసుకొనే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని సోహైల్ ని అడగగా… అందుకు సోహెల్ నేను కోపంగా ఉన్నప్పుడు నన్ను కూల్ చేసే సామర్థ్యం ఉన్న అమ్మాయి కావాలని సోహెల్ చెప్పడంతో అందుకు శ్రీముఖి రెండు చేతులు జోడించి దండం పెట్టి అది ఎవరి వల్ల కాదని చెప్పింది.ఇలా సీనియర్ కంటెస్టెంట్ అందరూ కలిసి జూనియర్ కంటెస్టెంట్ లతో ఎంతో సరదాగా గడిపారు.వీరందరూ కలిసి చేసిన అల్లరిని చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…