బుల్లితెరపై ప్రసారమవుతున్న ది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తవ్వగ ప్రస్తుతం ఐదవ సీజన్ కూడా పూర్తవడానికి దగ్గర్లో ఉంది. ఇక గత నాలుగు సీజన్ లలో పాల్గొన్న కంటెస్టెంట్ లు కొంతవరకు మంచి క్రేజ్ సంపాదించుకొని సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్నారు.
ఇక ఈ సీజన్ కంటెస్టెంట్ లు కొన్ని అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా ప్రస్తుతం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు మాత్రం బయట బాగా అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సీజన్ 5 కు సంబంధించిన ఇద్దరు కంటెస్టెంట్ లు ఏకంగా మెగా స్టార్ హీరో రామ్ చరణ్ సినిమా లోనే ఛాన్స్ కొట్టేసినట్లు తెలిసింది.
ఇంతకీ ఆ ఇద్దరు కంటెస్టెంట్ లు ఎవరో కాదు.. బుల్లితెర నటుడు విశ్వ, యాంకర్ లోబో. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ చేయనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో లోబో, విశ్వ నటించనున్నట్లు బాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం గురించి ఇంతవరకు ఎవరు కూడా ప్రకటించక పోగా త్వరలోనే ఇందులో ఎంత నిజముందో తెలిసిపోతుంది. అంతే కాకుండా వీరు రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హాల్ చల్ చేస్తున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లో లోబో, విశ్వ తమ పరిచయాన్ని మరింత పెంచుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…