తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. దీనితో వీక్షకులు ప్రతి ఒక్క ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాస్క్ లో భాగంగా గొడవ పడడం, వెంటనే కలిసిపోవడం లాంటివి చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్.
ఇది ఇలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. కెప్టెన్ షన్ను మినహా మిగిలిన అందరూ నామినేషన్ లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ తాజాగా వీరికి ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ నామినేషన్స్ నుంచి ఒకరు తప్పించుకునే అవకాశం కల్పించాడు. బ్యాగేజ్ జోన్,డేంజర్ జోన్, సేఫ్ జోన్ అంటూ మూడు భాగాలుంటాయి.
టాస్క్ లో గార్డెన్ ఏరియాలో ఒక సేఫ్ జోన్ డోర్ లోకి తమ ఫోటో కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులు ఫోటోలు ఉన్న భాగాలు తీసుకొని పరిగెత్తాలి.ఇలా వెళ్లే క్రమంలో ఎవరు అయితే చివరగా సేఫ్ జోన్ లోకి వెళ్ళ్తారో, అతడితో పాటు అతని చేతిలో ఎవరి ఫొటో ఉన్న బ్యాగ్ ఉందో ఆ ఇద్దరు డేంజర్ జోన్ కి వెళ్తారు. ఈ గేమ్ లో కాజల్,శ్రీరామ్ తొలిరౌండ్ లోనే డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
కాజల్ ఫోటో ఉన్న బ్యాగు తీసుకున్న శ్రీరామ్ చంద్ర ముందుగా గార్డెన్ లోకి వచ్చినప్పటికీ కావాలనే సేఫ్ జోన్ లోకి వెళ్లన్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో అని మాస్టర్ విన్ అయింది. గత వారం అని మాస్టర్ కు వచ్చిన పవర్ ను వాడే సమయం వచ్చిందని తెలిపారు బిగ్ బాస్. దీంతో ఒకరిని నామినేషన్ నుంచి తప్పించవచ్చని చెప్పగా అనీ మాస్టర్ మానస్ ను నామినేషన్స్ నుంచి తప్పించింది. అలా ఆ ఇద్దరు బయట పడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…