బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం నుంచి నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఇప్పటికే 19 మంది కంటెస్టెంట్స్ నుంచి ముగ్గురు వెళ్లిపోయారు. ఇక నాలుగో వారం నుంచి కొరియోగ్రాఫర్ నటరాజ్ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతకముందు ముగ్గురు విషయంలో కూడా లీకురాజాలు చెప్పినవి చెప్పినట్లుగానే జరిగాయి.
ఇప్పుడు కూడా వాళ్లు నటరాజ్ బయటకు వెళ్లాడని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 16 మంది కంటెస్టెంట్లలో ఇక నటరాజ్ వెళ్లిపోగా 15 మంది మాత్రమే మిగిలారు. ఇక నాలుగోవారం నామినేషన్ లో ఉన్న 8 మంది కంటెస్టెంట్లలో మొదట నాగార్జున రవిని సేవ్ చేయగా.. తర్వాత ప్రియాను సేవ్ చేశారు. తర్వాత సన్నీ, కాజల్ ను ఒకేసారి సేవ్ చేశాడు.
ఇక మిగిలిన లోబో, యానీ, సిరి, నటరాజ్ లలో ఎవరు వెళ్లిపోతారు అనే దానిని సస్పెన్స్ లో పెట్టాడు. ఇక దీనిలో లోబో, యానీ, నటరాజ్ లు చివరి వరకు ఉండగా.. నటరాజ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతడి ఓటింగ్ శాతం బాగా తగ్గిందగని.. అతడు హౌస్ లో అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ వే లో ఉంటున్నాడని.. హౌస్ లో ఉండే ప్రతీ ఒక్కరికి జంతువుల పేర్లు పెట్టి విసిగిస్తున్నాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అది బిగ్ బాస్ హౌస్ లా లేదు.. జంతు ప్రదర్శనశాలగా ఉందంటూ కామెంట్లు కూడా పెట్టారు. అందుకే నటరాజ్ ను బయటకు పంపేయాలనే ఆలోచన ప్రేక్షకులకు వచ్చిందని టాక్. ఇదంతా ఇలా ఉండగా.. నామినేషన్ లోనే నటరాజ్ బయటకు వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. ప్రస్తుతం మరి అతడు బయటకు వచ్చాడా.. లేదా అనేది ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో తెలియనున్నది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…