బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత అందులో పాల్గొన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ తలరాతలు మారిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ కు వచ్చిన తరువాత బాగా ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ షో నుంచి బయటకు వెళ్లిన తర్వాత చాలామంది వెండితెరపై అవకాశాలు కూడా సాధించారు.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలామంది వారికి నచ్చిన ఖరీదైన కార్లను కొనడం కామన్ గా మారిపోయింది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లో పాల్గొన్న హిమజా, సోహెల్, అఖిల్, అరియానా, శివ జ్యోతి, లాంటి కంటెస్టెంట్ లు ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ లిస్ట్ లోకి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ విశ్వా చేరాడు. విశ్వ కూడా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన కలను నెరవేర్చుకున్నాడు.తాజాగా విశ్వ కూడా ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశారు.నిజానికి విశ్వ హౌస్ లో నుంచి త్వరగానే ఎలిమినేట్ అయినప్పటికీ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.
తాజాగా విశ్వ బీఎండబ్ల్యూ కారును కొన్నాడు. దీంతో ఇంత లగ్జరీ కారును కొనేయడంతో అంతా షాక్ అవుతున్నారు. మనం కలలు కన్న కారును కొంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం. ఇప్పుడు నేను అదే ఫీలింగ్‌లో ఉన్నా.. మా కుటుంబంలోకి కొత్త మెంబర్ వచ్చింది.. దీనంతటికి కారణం ఆ దేవుడు, బిగ్ బాస్ అంటూ విశ్వ ఎమోషనల్ అయ్యాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…