Movie News

బిగ్ బాస్ సీజన్ 5 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఈ 8 మందేనా.. అసలేంటి వీళ్ళ బలం..

ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కి యూట్యూబ్ స్టార్ట్ గా, యాంకర్స్, ఆర్టిస్టులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా 19మంది కంటెస్టెంట్ లను పంపించారు.

ఈ విధంగా హౌస్ లోకి వెళ్ళిన ఈ కంటెస్టెంట్ ల గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్, నామినేషన్, ఎలిమినేషన్స్ టైటిల్ విన్నర్ వీళ్లే అంటూ పెద్దఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 19మంది కంటెస్టెంట్ లో కొంత మంది కంటెస్టెంట్ లు చాలా స్ట్రాంగ్ అని ఈ 8 మంది హౌస్ లో ఎక్కువ రోజులు ఉండడంతోపాటు టైటిల్ గెలుచుకోవడానికి పోటీపడతారనీ నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరు వారు అంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

యాంకర్ రవి: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్నారు. అదే రవికి బలం అని చెప్పవచ్చు.

షణ్ముఖ్ జస్వంత్: షణ్ముఖ్ యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతని బలం యూట్యూబ్ ఫ్యాన్ ఫాలోయింగ్.

సిరి హన్మంత్: లేడీ కంటెస్టెంట్ లో ఒకరైన సిరి హన్మంత్ కి కూడా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ షో, యూట్యూబ్ ఫాలోయింగ్ ఈమె బలం అని చెప్పవచ్చు.

సింగర్ శ్రీరామచంద్ర: సింగర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీ రామచంద్ర ఇండియన్ టైటిల్ విజేత కావడం అలాగే తన గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉండటం ఈయనకు బలం అని చెప్పవచ్చు.

సరయు: లేడీ కంటెస్టెంట్ లలో సిరి తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ సరయు అని చెప్పవచ్చు. ఈమెకు యూట్యూబ్ ఫాలోయింగ్ భారీగా ఉంది. అలాగే ఏ విషయమైనా ముక్కుసూటితనంగా మాట్లాడే తత్వం ఈమె బలం.

మానస్ : సీరియల్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న కంటెస్టెంట్ మానస్ ఇదే అతని బలం.

ప్రియాంక సింగ్: ట్రాన్స్ జెండర్ గా మారిన ప్రియాంక సింగ్ సింపతీనే ఈమె బలం.

లోబో: ఒకప్పుడు యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లోబో ప్రస్తుతం తన కామెడీ ద్వారా ప్రేక్షకులను చేస్తున్నారు. తన కామెడీనే ఈ కార్యక్రమంలో తనకు మంచి గుర్తింపు ఇస్తుందని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago