కొన్ని ఘటనలు ఇలా జరుగుతాయిని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇలా ఓ కుటుంబంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నాలుగేళ్ల చిన్నారి ఇంట్లో సరదాగా ఆడకుకుంటూ.. రూపాయి నాణెం మింగింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ చిన్నారికి నాలుగేళ్లు. అల్లారుముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. కర్ణాటకలోని మైసూర్ జిల్లా హున్సూర్ తాలూకాలో అయరహళ్లి గ్రామలో నివాసం ఉంటుంన్నారు. అయితే ఖుషి అనే ఈ నాలుగేళ్ల చిన్నారి.. ఆమె తాతయ్యతో ఇంట్లో ఆడుకుంటుంది. అనుకోకుండా ఒక రూపాయి నాణాన్ని మింగింది.
గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మైసూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేసి గొంతుల్లో ఇరుక్కుపోయిన నాణాన్ని బయటకు తీయడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
నాణెం లోనికి వెళ్లడం వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంతో చిన్నారి మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలోనే కాదు.. ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంట్లో సందడిగా ఆడుకునే తన కూతురును చూసి ఎంతో మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ఈ ఘటన తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వారు తనబిడ్డ లేదనే బాధతో.. వారు చేస్తున్న ఆర్తనాదాలు ప్రతీ ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…