బిగ్ బాస్ రియల్టీ షోలో ముఖ్యంగా కెప్టెన్ ఎవరు అవుతారు.. ఇంటి నుంచి ఈ వారం ఎవరు బయటకు వెళ్తారు అనేది సస్పెన్స్ .టీవీ ముందు కూర్చున్న సగటు ప్రేక్షకుడు కూడా దీనిపై ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తాడు. కానీ లీకు రాజాలా పుణ్యమా అని అది ముందుగానే తెలిసిపోతుంది. సీజన్ 4 లో కూడా ఇలానే బయటకు వచ్చాయి.
సీజన్ 5 లో ఇలాంటి లీకులు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన బిగ్ బాస్ నిర్వాహకులు వాటిపై అంత శ్రద్ధ పెట్టలేదని తెలిసిపోతుంది. మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి బయటకు వచ్చేస్తారన్న విషయాలు ముందుగానే సోషల్ మీడియాలో వైరల్ కాగా అందరికీ తెలిసిపోయింది.
అయితే మూడో వారం కెప్టెన్ గా జెస్సీ అవుతాడనే విషయాన్ని ఈ సారి లీకుల ద్వారా తెలియలేదు.. కానీ బిగ్ బాసే చెప్పేశాడు. అది డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు. ఎలా అంటే.. ఈ వారం ఎవరు కెప్టెన్ అయ్యారన్న విషయాన్ని ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పేశాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఫస్ట్ లవ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన ప్రోమోలో మోడల్ జశ్వంత్ చేతికి కెప్టెన్సీ బాండ్ కనిపించింది.
దీంతో జెస్సీ ఈ వారం కెప్టెన్ అయ్యాడని స్పష్టమయింది. తీరా ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగానే కెప్టెన్ జశ్వంత్ అయ్యాడు. అంత పెద్ద విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులు సింపుల్ గా ఇలా చెప్పారేంటీ అంటూ నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు. జశ్వంత కెప్టెన్ అవ్వడంతో తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడన్న అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…