Featured

బిగ్ బాస్ విజేత ఎవరో చెప్పేసిన గూగుల్… విన్నర్ ఎవరంటే?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 గత రెండు వారాల క్రితమే ప్రారంభమయ్యి ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే గత సీజన్లో మాదిరి కాకుండా ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లను ఒకేసారి పంపించి ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు వారాలకు గానీ హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం హౌస్ లో 17 మంది కంటెస్టెంట్ ల మధ్య టైటిల్ కోసం తీవ్రస్థాయిలో పోటీ జరుగుతుంది.

బిగ్ బాస్ హౌస్ లో జరిగే ఏ విషయం కూడా బయటకు తెలియకుండా బయట విషయాలు లోపల ఉన్న కంటెస్టెంట్ కు తెలియకుండా నిర్వాహకులు ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఇలా జాగ్రత్తలు పడుతున్నప్పటికీ ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారమే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవడం గమనార్హం.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైన మూడు వారాలకే ఈ సీజన్ విజేత ఎవరు అనే విషయం గురించి గూగుల్ బయటపెట్టేసింది. ఈ క్రమంలోనే గూగుల్ సెర్చ్ లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజేత ఎవరని టైప్ చేయగా అందులో కంటెస్టెంట్ సింగర్ శ్రీరామచంద్ర పేరు చూపించడం గమనార్హం. ఇలా గూగుల్ విజేత పేరును డిక్లేర్ చేయడంతో ప్రేక్షకులు కొంతవరకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన శ్రీ రామచంద్ర అభిమానులు మాత్రం తెగ ఆనంద పడుతున్నారు.

కేవలం శ్రీ రామచంద్ర పేరు మాత్రమే కాకుండా ప్రియాంక సింగ్ పేరు కూడా చూపిస్తూ ఉండటంతో కొందరు ఆనందం వ్యక్తం చేసినా మరికొందరు గూగుల్ తప్పిదాల పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి గూగుల్ సర్వే ప్రకారం ఈ సారి విజేతగా శ్రీ రామచంద్ర గెలుస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago