మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే ఊబకాయం బారిన పడుతున్నారు. దాని బారి నుంచి బయటపడటానికి నానా కష్టాలు పడుతున్నారు. దీని కోసం జిమ్ లకు వెళ్లడం.. ఆహారం తినకపోవడం వంటివి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అందరికీ తెలియాలి.
అదేంటంటే.. బరువు తగ్గడం, కొవ్వు తగ్గడం రెండూ ఒకటేనా..? అవి రెండూ ఒక్కటే అనే ఆలోచనలో చాలామంది ఉంటుంటారు. కానీ అలా కాదు. ఈ రెండిటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వ్యత్యాసం ఏమిటో వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.. కొవ్వు, కండరాలు, వాటర్ వెయిట్‌తో సహా ఒక వ్యక్తి బరువు మొత్తం తగ్గడం అనేది.. శరీరంలో బరువు తగ్గడం అంటారు.
ఆ శరీరం నుంచి కొవ్వును మాత్రమే కోల్పోవడం అనేది కొవ్వు తగ్గించుకోవడం అంటారు. కొవ్వు ఒక్కటే తగ్గించుకుంటే.. బరువు తగ్గినట్లు కాదు. బరువు తగ్గడం కంటే కొవ్వును సులువగా తగ్గించుకోవచ్చు. అందుకే కొవ్వు తగ్గిన చాలా మందకి బరువు మాత్రం తగ్గదు. అయితే బరువు తగ్గడం కంటే కూడా కొవ్వు తగ్గించుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
బరువు తగ్గాలంటే మాత్రం కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతీ రోజు వ్యాయామం చేస్తే.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది. తినే ఆహారంలో నూనెలు లాంటివి తగ్గిస్తే మన శరీరంలో కొవ్వు తగ్గిపోతుంది. బ్యాలెన్స్ గా డైట్ ను ఫాలో అవుతూ శరీర కొవ్వును తగ్గించుకోవాలి.. ఒక్కసారిగా అన్ని జరగాలంటే మాత్రం.. ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కండరాల ద్రవ్యరాశి కోల్పోవాలన్నా.. కొవ్వు తగ్గాలన్నా.. అధిక ప్రోటీన్లు కలిగిన ఆహార పదర్ధాలను తింటే మంచిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…