Featured

పొరపాటున శ్రీను వైట్లకి మహేశ్ ఛాన్స్ ఇచ్చాడంటే వాళ్ళంతా క్యూ కడతారేమో..?

సూపర్ స్టార్ మహేశ్..టాలీవుడ్‌లో ఇప్పుడు పేరుకున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే మహేశ్ చేసిన దర్శకులతో సినిమాలు చేయడానికి బాగానే ఆసక్తి చూపిస్తాడు. ఒకసారి తనతో సినిమా చేసి హిట్ ఇస్తే ఆ దర్శకుడికే మళ్ళీ అవకాశం ఇస్తాడు. డీసెంట్ కథలతో మెప్పించడం మాత్రమే కాకుండా మహేశ్ వద్దకి వెళ్ళే సమయానికి బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ పడుండాలి. అప్పుడు దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి పెద్దగా ఆలోచించడు.

అయితే ఇదే పద్దతి ఫాలో అవతుండటం వల్ల కొందరు గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశాలు కూడా కొన్ని సార్లు మిస్ అవుతున్నాడు మహేశ్. తనకి ఆల్‌రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చినా కూడా ఆ తర్వాత ఆ దర్శకుడి ఫ్లాప్స్ వచ్చి కాస్త ఫాంలో లేకపోతే మాత్రం పట్టించుకోడు. ఇదే మాట స్వయంగా మహేశ్‌కి పోకిరి రూపంలో ఒక ఇండస్ట్రీ హిట్ బిజినెస్ మేన్ రూపంలో ఓ భారీ కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథే స్వయంగా చెప్పుకొచ్చాడు. అందుకు కారణం ఆయన, మహేశ్‌ని దృష్ఠిలో పెట్టుకొనే జనగణమన అనే కథ రాసుకున్నాడు.

అందరి ముందు కూడా ఈ విషయాన్ని మహేశ్ – నమ్రతలకి చెప్పాడు. ఈ కథలో మహేశ్‌ని తప్ప ఇంకెవరినీ నేను ఊహించుకోలేనని. అయితే జనగణమన కథ మహేశ్‌కి నచ్చలేదనేది ఇంటర్నల్ టాక్. అందుకే ఆ కథను మహేశ్ రిజెక్ట్ చేశాడట. సరే మరో కథ వినడానికి రెడీనా అంటే ఎందుకో అదీ కుదరడం లేదు. పూరి మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకొని ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. కాగా మహేశ్ – దర్శకుడు శ్రీను వైట్ల కలిసి మళ్ళీ సినిమా చేయనున్నారని టాక్ మొదలైంది. అందుకు కారణం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దూకుడు సినిమా.

ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహేశ్‌కి కథ చెప్పేందుకు శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడట. దూకుడు వంటి భారీ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లనే ఆగడు వంటి డిజాస్టర్ కూడా ఇచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆగడు తర్వాత మళ్ళీ శ్రీను వైట్ల కోలుకునే హిట్ సినిమా చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ నమ్మి మళ్లీ శ్రీను వైట్లకి అవకాశం, ఇస్తే చాలా గొప్పే. ఇదే గనక జరిగితే తనకి ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులంతా మళ్ళీ మీకో భారీ హిట్ ఇస్తామని మహేశ్‌కి కథ చెప్పడానికి రెడీ అవుతారు. మరి మహేశ్ నిజంగానే శ్రీను వైట్లకి ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది కొన్నాళ్ళు ఆగితే గానీ తెలియదు.  

అది జరగాలన్నా ఇంకా చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం మహేశ్, పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత త్రివిక్రం శ్రీనివాస్‌తో ఒక సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఎంపిక చేశారు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డా.కె.ఎల్.నారాయణ నిర్మాతగా ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది. ఇవి పూర్తయ్యాకే శ్రీను వైట్లతో ప్రాజెక్ట్ మూవ్ అవుతుంది.
చూడాలి మరి ఏం జరుగుతుందో.  

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago