బిగ్ బాస్ సీజన్ 5 ప్రతీ రోజూ ఎదో ఒక ట్విస్ట్ తో రన్ అవుతోంది. అయితే ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది కేవలం 17 మంది మాత్రమే. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. అయితే సీజన్ 4 లో అవినాశ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఎంతో కొంత కామెడీని పంచారు.
కానీ ఈ సారి ఆలోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సారి చాలామంది తెలియని వారే హౌస్ లోకి వెళ్లారు. అయితే మొదట ఎలిమినేట్ అయిన సరయు వారానికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే రెండో వారంలో ఎలిమినేట్ అయిన ఉమాదేవి రెండు వారాలకు ఎంత తీసుకున్నారనే ఉత్సుకత ప్రతీ ఒక్కరిలో ఉంది.
ఆమె రెండు వారాలకు వారానికి రూ.80 వేల చొప్పును రూ.1.60 తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీజన్ 4 కంటే కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్‌కు భారీగానే చెల్లిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే యాంకర్ రవి ఎక్కవ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. రెండవ వారం ఎలిమినేట్ అయిన ఉమాదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీక దీపంలో ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. అటు సినిమాల్లోను, ఇటు సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయిపోయారు ఉమా.
తనదైన శైలిలో హౌస్ లో అందరినీ ఆకట్టుకున్నా.. ఉమాదేవి నోటి దురుసు వల్ల బయటకు రావాల్సి వచ్చిందంటూ టాక్ వినపడుతోంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతున్నదేంటంటే.. హౌస్ లో ఉండే వాళ్లను ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు.. వాళ్లు మాట్లాడే భాష అసభ్యకరంగా ఉంటే రిసీవ్ చేసుకోవట్లేదని తెలుస్తోంది. దాని కారణంగానే ఉమా, సరయు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…