గత కొన్ని నెలల నుంచి ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం సెప్టెంబర్ 5వ తేదీ ఆదివారం ఎంతో అట్టహాసంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున రెట్టింపు ఉత్సాహంతో బిగ్ బాస్ వేదికపైకి ఒక్కొక్క కంటెస్టెంట్ కు స్వాగతం చెబుతూ వారితో ముచ్చటించి వారిని హౌస్ లోనికి పంపించారు. గత సీజన్లో ఎప్పుడు లేని విధంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇచ్చారు.
ఒక్కసారిగా కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లోకి వెళ్లడం తో బిగ్ బాస్ హౌస్ లో ఎంతో సందడి నెలకొంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లో జరిగిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రాత్రి పెద్ద ఎత్తున గురక పెడుతూ తోటివారికి నిద్రలేకుండా చేస్తున్న లోబో గురకను యాంకర్ రవి ఆపే ప్రయత్నం చేశారు.అలాగే మరికొందరు కంటెస్టెంట్ లు నిద్రపోకుండా ముచ్చట్లు పెట్టుకున్నారు.
ఇక బిగ్ బాస్ ప్రణామం అనే పాటతో కంటెస్టెంట్ లను నిద్రలేపి వారిలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు ఎవరి పనుల్లో వారు నిమగ్నం కాగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రియాంక సింగ్, కాజల్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ మాట్లాడుతూ తన మనసులోని మాటలను బయట పెట్టారు. తను ట్రాన్స్ జెండర్ గా మారి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన తండ్రికి ఈ విషయం తెలియదని ఈ విషయంలో తన తండ్రిని మూడు సంవత్సరాలనుంచి మోసం చేస్తున్నానని, ప్రియాంక తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఒకరోజు తన తండ్రి మీసం గడ్డం ఏవి రా అని అడిగినప్పుడు లేడీ గెటప్ కోసం తీసేసాను అంటూ అపద్దం చెప్పానని చెబుతూ ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే కాజల్ తనని దగ్గరకు తీసుకొని ఓదార్చారు. తను లింగ మార్పిడి చేయించుకున్న విషయాన్ని బిగ్ బాస్ వేదికగా తన తండ్రికి చెప్పినట్లు ప్రియాంక కాజల్ దగ్గర చెబుతూ ఎమోషనల్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…