Movie News

‘జబర్దస్త్‌’లో ముద్దులతో రెచ్చిపోయిన ఆట సందీప్.. జ్యోతి.. బిగ్‌బాస్‌ మిస్ అయినందుకా అంటూ ట్రోలింగ్..

జబర్దస్త్.. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ప్రేక్షకాదరణ పొందుతున్న టీవీ షో. ఎంతో మందిని కమెడీయన్స్‌గా తీర్చిదిద్ది.. వారికంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. సుధీర్‌లాంటి వాళ్లకు సినిమా ఛాన్స్‌లనూ తెచ్చిపెట్టింది. ఇంతకుముందు ఇలాంటి ప్రోగ్రామ్స్‌ ఎన్ని వచ్చినా.. ఇటీవలి కాలంలో పోటీగా అలాంటి షోలు ప్రారంభించినా.. జబర్దస్త్‌కు క్రేజ్‌ను అందుకోలేకపోయారు. మొదట జబర్దస్త్‌తో ప్రారంభమైనా.. ఆ తర్వాత వచ్చిన విశేష స్పందనను చూసి ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను పరిచయం చేసి, మరికొంతమంది కొత్త ఆర్టిస్ట్‌లకు అవకాశం కల్పించారు. నిజం చెప్పాలంటే టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఇదో మంచి వేదిక. అలాంటి షోని ఇన్నాళ్లు ఆదరిస్తున్నారంటే కారణం… వారానికో కొత్తదనంతో నవ్వించడం అంటే మామూలు విషయం కాదుకదా..!

ఇకపోతే ప్రతి గురు, శుక్ర వారాల్లో ప్రసారమయ్యే ఈ షోని ఇంటిల్లిపాదీ చూసే విధంగా పాపులర్‌ అయింది. అయితే కొన్ని సందర్భాల్లో చేసే మితిమీరిన కామెడీ పలు విమర్శలకు తావిస్తోంది. ఇంతకుముందు వేణు, ఆదిలాంటి వారు కొన్ని సంఘటనలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అలాగే తాజాగా రిలీజైన ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ప్రోమోపైనా పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కారణం, అందులో ఆట ఫేమ్ సందీప్, అతని భార్య జ్యోతి చేసిన ఓ స్కిట్‌లోని కొన్ని సన్నివేశాలు. స్కిట్‌లో భాగంగా జ్యోతి… సందీప్‌ని కౌగిలించుకొని, ముద్దు పెడుతుంది. అంతేకాదు.. ఆమె కన్నుకొడుతూ చేసిన ఎక్స్‌ప్రెషన్‌ ఈ ప్రోమో కు హైలెట్ అయ్యింది.

ఇకపోతే… దీన్నంతటినీ చూస్తున్న జడ్జీలు రోజా, మనోలు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అందరూ చూసేవిధంగా నవ్వులు కురిపించమంటే.. ఇలా శ్రుతిమించిన సన్నివేశాలు పెట్టడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సందీప్ వెళ్తున్నారనే వార్తలు రాగా.. అది నిజం కాదని షో ప్రారంభంతో తేలిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఆ షోలో ఛాన్స్ మిస్‌ అయిందని.. ఈ షోలో రెచ్చిపోతున్నారా అంటూ మరికొందరు నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago