Movie News

రజనీకాంత్ అంకుల్ తో హీరోయిన్ గా చేయడానికి అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా: నటి మీనా

అందం అభినయం,నటనా నైపుణ్యంతో అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న హీరోయిన్లలో అలనాటి నటి మీనా ఒకరు. 90లలో ఈమె తమిళ, తెలుగు రాష్ట్రాలలో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. ఎన్నో కుటుంబ కథాచిత్రాలలో ఎంతో అద్భుతంగా నటించిన మీనా నిజానికి తమిళమ్మాయి అయినప్పటికీ ఈమె మాత్రం అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

నటనపై ఆసక్తి ఉండడం చేత మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనా ఆ తర్వాత హీరోయిన్ గా సినిమా అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ తో జతకట్టి నటించిన “ముత్తు”సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని  “థిల్లానా థిల్లానా” పాట అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

నిజానికి మీనా రజనీకాంత్ సరసన నటించిన మొట్ట మొదటి చిత్రం  ‘యజమాన్‌’. ఈ సినిమాను తెలుగులో “రౌడీ జమిందార్” గా డబ్ చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో రజినీకాంత్ గారితో నటించడానికి తను చాలా ఇబ్బంది పడ్డానని, మీనా ఓ సందర్భంలో తెలియజేశారు. అలా ఇబ్బంది పడటానికి కారణం ఏంటనే విషయానికి వస్తే… మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా రజనీకాంత్ నటించిన “అన్బుళ్ల రజనీకాంత్” అనే సినిమాలో రజినీకాంత్ గారిని అంకుల్.. అంకుల్ అంటూ పిలుస్తూ తిరిగేదాన్ని. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం రజనీకాంత్ ఇంట్లోనే జరిగింది.

అలా రజనీకాంత్ గారిని అంకుల్ అని పిలుస్తూ ఇప్పుడు హీరోయిన్ గా తన పక్కన రొమాన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డానని, అయితే తన కెరీర్ మొదట్లోనే అలాంటి సూపర్ స్టార్ తో నటించే అవకాశం వచ్చిందని మరొకవైపు ఆనందం పొంగుకొస్తున్నా, మరోవైపు భయం వేసేదని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ లో భాగంగా మీనా పువ్వులు కోయటానికి వెళుతూ కిందపడే దృశ్యాన్ని చిత్రీకరించారు.ఈ షాట్ ఓకే అయిన తర్వాత రజనీ కాంత్ గారు తనకు కంగ్రాట్స్ చెప్పి ప్రోత్సహించినప్పటికీ తనలో ఓ విధమైనటువంటి భయం ఉండేదని ఓ సందర్భంలో మీనా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago