Movie News

బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్ళే.. కానీ టైటిల్ గెలుచుకొనేది అతనే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం భాషలలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకొని, ఇటీవలే ఐదవ సీజన్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఐదవ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అలాగే ఏడుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు.

అయితే గత సీజన్స్‏కు రెస్పాన్స్ అదిరిపోయిన 5వ సీజన్ మాత్రం ప్రేక్షకులను అంతగా నచ్చడం లేదనేది ముందు నుంచి వినిపిస్తున్న వాదన. ఇందుకు గల కారణం ఈసారి హౌస్‏లో అంతగా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ రాకపోవడమే.అలాగే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదా అనే సందేహాలు కూడా వ్యకమయ్యాయి. ఇదిలా ఉంటే షో ఆరంభంలో ప్రేక్షకులు అంతగా ఆదరించకపోయిన వారాలు గడుస్తున్న కొద్ది ఆట రసవత్తరంగా మారిపోయింది.

ఈ షో మొదటీ మూడు వారాలు షో కొంచం బోరింగ్ గా సాగిన నాలుగో వారం నుంచి కంటెస్టెంట్స్ ఆట తీరులో మార్పు వచ్చింది. ఇకపోతే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో జనాలకు తెలిసిన కంటెస్టెంట్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.వారిలో యాంకర్ రవి యూట్యూబర్ షణ్ముఖ్, సిరి, ప్రియా, సన్నీ, ఉమాదేవి, శ్రీరామ్,విశ్వ, మానస్, లోబో, నటరాజ్ మాస్టర్, కాజల్‏లకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. ఇక లహరి, శ్వేత, హమిదా, సరయు, అంతకు ముందు జనాలకు అంతగా తెలియదు.

ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారు ? టాప్ 5 లో ఎవరెవరుంటారు ? అనే దానిపై నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి విన్నర్ అయ్యేందుకు సన్నీకి,మానస్ మధ్య గట్టి పోటీ ఉండబోతుందని నెట్టింట్లో టాక్ నడుస్తోంది. వీరిద్దరిలో ఒకరు విన్నర్ కావడం మరోకరు రన్నర్ అప్ గా నిలవబోతున్నారంటూ లెక్కలు వేస్తున్నారు నెటిజన్స్. అలాగే టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్‏లో యూట్యూబర్ షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్, సన్నీ ఉండనున్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago