Bigg Boss 6: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ కార్యక్రమాన్ని బుల్లితెరపై ఆరవ సీజన్ ప్రసారం చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇక ఈ సీజన్లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారని వీరిలో 15 మంది ఆదివారం హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా మరో నలుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లను క్వారంటైన్‌కి తరలించారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ప్రోమోలు విడుదల చేయగా ఈ ప్రోమో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి.
ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్ విడుదల చేశారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం ఏర్పాటు చేసిన హౌస్ చూపించారు. అయితే గత సీజన్ల కన్నా ఈ సీజన్లో ఏర్పాటుచేసిన హౌస్ ఎంతో భిన్నంగా ఉందని తెలుస్తోంది.అదేవిధంగా ఆదివారం ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన ఎంట్రీ, పర్ఫామెన్స్ లను కూడా చూపించారు.
ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికొస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ పింకీ, ఆదిరెడ్డి, గలాటగీతు, రీతు చౌదరి, చలాకి చంటి, రేవంత్,బుల్లితెర దంపతులు రోహిత్-మెరీనా అబ్రహం, సిరి ప్రియుడు శ్రీహాన్ వంటి కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విషయం తెలియాలంటే మరి రెండు రోజులు వేచి ఉండాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…