Movie News

Shriya Saran: మొదటిసారి కూతురి ఫేస్ రివీల్ చేసిన నటి శ్రియ… ఎంతో క్యూట్ గా ఉన్న రాధ వైరల్ అవుతున్న ఫోటోలు !

Shriya Saran: టాలీవుడ్ సినీ ప్రేమికులకు నటి శ్రీయ గురించి పరిచయం అవసరం లేదు. ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకుంది.ఇలా అగ్ర హీరోలు అందరు సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించిన శ్రియ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా పలు సినిమాలలో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా సినీ కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్న ఈమె తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే ఈమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా 2018లో ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లాడి తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఇక పెళ్లి విషయమే కాకుండా తన ప్రెగ్నెన్సీ విషయాన్నీ కూడా సీక్రెట్ గా ఉంచారు.

ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న శ్రియ 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపి అందరిని మరోసారి ఆశ్చర్యపరిచారు.ఇకపోతే తనకు కూతురు పుట్టిన విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటివరకు తన కూతురి ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఈమె ఎక్కడ తన కూతురి ఫేస్ మాత్రం కనపడకుండా జాగ్రత్త పడ్డారు.

Shriya Saran: భర్త పుట్టిన రోజు సందర్భంగా…

అయితే తాజాగా తన భర్త పుట్టినరోజు సందర్భంగా శ్రియ తన కూతురి ఫోటోలను షేర్ చేశారు. ఇలా మొదటిసారి ఈమె తన కూతురు ఫేస్ కూడా రివీల్ చేయడంతో ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే శ్రియ కూతురి ఫోటోలు చూసిన అభిమానులు రాధా ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago