Movie News

Pawan Kalyan: త్రివిక్రమ్ చేసిన పనికి మాటలు పడాల్సి వస్తుంది… డైరెక్టర్ పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోలలో ఈయన ఒకరు.ఇకపోతే నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక స్టార్ హీరో పుట్టినరోజు కనక వస్తే ఆయన నటించిన సినిమాలు తిరిగి విడుదల కావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే సెప్టెంబర్ రెండవ తేదీ జల్సా సినిమా ప్యారిస్ లో కూడా ప్రదర్శితం కానుంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తెలుపుతూ ఒక నేటిజన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై ‘లార్గో వించ్‌’ డైరక్టర్‌ జెరోమ్‌ సల్లే రీట్వీట్‌ చేశారు. అక్కడితో ఆగకుండా ‘పవన్‌ కోసం ఏదైనా బహుమతి కావాలా? ఏదైనా స్క్రిప్ట్ లాంటిది అంటూ రీ ట్వీట్ చేశారు.

‘లార్గో వించ్‌’ సినిమా ఆధారంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరోగా అజ్ఞాతవాసి సినిమాని చేశారు. ఈ సినిమా పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా ‘లార్గో వించ్‌’ ఆధారంగా చేసే ఫ్లాప్ కావడంతో ఈ సినిమా డైరెక్టర్ జెరోమ్‌ సల్లే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జెరోమ్‌ పై మండిపడుతున్నారు.

పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే చెప్పు కానీ మళ్ళీ ఫ్లాప్ అయిన సినిమాని గుర్తు చేస్తూ ఈ గుచ్చుడు ఏంది అంటూ కామెంట్లో చేస్తున్నారు. మరికొందరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న పనికి ప్రస్తుతం
జెరోమ్‌ వల్ల ఇన్ని మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు.ఇక మరికొందరైతే ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీకు అజ్ఞాతవాసి సినిమా అంత బాగా నచ్చి ఉంటే ఇప్పటికీ ప్రింట్ అలాగే ఉంది వచ్చి పట్టుకెళ్ళూ అంటూ తమదైన శైలిలో కౌంటర్స్ ఇస్తున్నారు.

 

 

Pawan Kalyan: మర్చిపోదామన్న గుర్తు చేస్తున్నారుగా….

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ అజ్ఞాతవాసి సినిమా అంత డిజాస్టర్ సినిమా ఏదీ లేదని చెప్పాలి.ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా మర్చిపోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఇలా ఈ సినిమా గురించి గుర్తు చేస్తూ ఆయన పుట్టినరోజు ఇలాంటి ట్వీట్లు చేయడంతో అభిమానులు కాస్త అప్సెట్ అయ్యారని తెలుస్తోంది.ఇకపోతే నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను జరుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago