Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు కార్యక్రమం 11 వారాలను పూర్తి చేసుకొని హౌస్ నుంచి 12 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే పదకొండవ వారంలో భాగంగా కంటెస్టెంట్ మెరీనా ఎలిమినేట్ అయ్యారు.ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఏ విధమైనటువంటి రిమార్క్ తో బయటకు రాకుండా కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఈమె బిగ్ బాస్ కేఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ శివ ఎంతో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ తనని ఎంతో అవమానకరంగా మాట్లాడారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే శివ మెరీనానీ ప్రశ్నిస్తూ జనాలు చూస్తున్నారు జనాలు చూస్తున్నారు అని మీరే ఎక్కువగా వాడారు. జనాలు చూడటానికి మీరేం చేశారు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు మెరీనా సమాధానం చెబుతూ నేను నాలా ఉన్నాను అని బదులు ఇచ్చారు. ఇంతకీ మీరు హౌస్ లో గేమ్ ఆడారా అంటూ మరోసారి ప్రశ్నించగా నాకు చేతనయింతవరకు ఆడానని ఈమె బదులిచ్చారు. నువ్వు రోహిత్ బిగ్ బాస్ హౌస్ కి కాకుండా ఏదో ట్రిప్ కి వచ్చినట్టు అనిపించింది అంటూ శివ మెరీనాని దారుణంగా కామెంట్స్ చేశారు.
మీకు కోపం కూడా వస్తుందా…
ఇలా శివ మాట్లాడటంతో నేను ఆడుగలుగుతానా లేదా అనే ఎంత టెన్షన్ పడ్డానో నాకు మాత్రమే తెలుసు అంటూ ఈమె సమాధానం చెప్పారు. మీరు నాకు కోపం తెప్పించాలని ఎంత ప్రయత్నించినా నాకు కోపం రాదని మెరీనా చెప్పగా మీకు కోపం కూడా వస్తుందా అంటూ వెటకారంగా నవ్వాడు.ఇలా మెరీనాతో యాంకర్ శివ అవమానకరంగా మాట్లాడటంతో ఎంతోమంది నెటిజన్లు యాంకర్ గా అందరిని ఒకే విధంగా ఇంటర్వ్యూ చేయాలి కానీ ఇలా ఒక్కొక్కరి పట్ల ఒక్కో విధంగా ఇంటర్వ్యూ చేయడం ఏంటి అంటూ మండి పడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…