Padmalaya Studio: నటశేఖరుడు కృష్ణ మరణించి పది రోజులు కాస్తున్నప్పటికీ ఇంకా ఈయన మరణ వార్తను తెలుగు చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కృష్ణ హీరోగా మాత్రమే కాకుండా పద్మాలయ స్టూడియోని కూడా స్థాపించి ఈ స్టూడియో నుంచి ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించిన సంగతి తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలతో సమానంగా ఈయన కూడా పద్మాలయ స్టూడియోని స్థాపించారు. అయితే ఈ స్టూడియో ప్రారంభించిన సమయంలో ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ స్టూడియోను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ స్టూడియో నిర్మాణంలో భాగంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ స్టూడియో ప్రారంభించడమే కాకుండా తన తల్లి నాగ రత్నమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మాలయ స్టూడియోని కృష్ణ హైదరాబాద్ ఫిలింనగర్ లో నవంబర్ 21 1983 న ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఎన్టీఆర్ చేతుల మీదుగా పద్మాలయ స్టూడియో ప్రారంభం…
ఈ విధంగా పద్మాలయ స్టూడియోస్ స్థాపించి 2022 నవంబర్ 21వ తేదీకి 39 సంవత్సరాలు పూర్తయింది.ఇక కృష్ణ మరణించడంతో పద్మాలయ స్టూడియో ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటో
లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ స్టూడియోని ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…