Movie News

Bigg Boss6: ఇంత త్వరగా బయటకు పంపుతారని ఊహించలేదు.. ఎమోషనల్ అయిన అభినయశ్రీ?

Bigg Boss6: బిగ్ బాస్ కార్యక్రమం రెండు వారాలను పూర్తిచేసుకుని మూడవ వారంలోకి అడుగు పెట్టింది.ఇక మొదటి వారం ఎలిమినేషన్ లేకపోయినప్పటికీ రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ తో శనివారం హౌస్ నుంచి శానీ బయటకు రాగ ఆదివారం అభినయశ్రీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇక శనివారం కంటెస్టెంట్లకు బాగా క్లాస్ పీకిన నాగార్జున ఆదివారం మాత్రం అందరితోనూ బాగా ఎంటర్టైన్ చేయించారు.

 

 

ఇక ఆదివారం ఎపిసోడ్లో భాగంగా తమన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈమె నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కోసం తమన్న ఈ వేదికపై సందడి చేశారు. ఇక హౌస్ లోకి తమన్నాను పంపించిన నాగార్జున ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను బయటకు తీసుకు రమ్మని చెప్పారు. ఈ క్రమంలోనే తమన్నా నామినేషన్ లో లీస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి అభినయ శ్రీ ని బయటకు తీసుకువచ్చారు.

ఇలా అభినయ ఎలిమినేట్ అయ్యారని తెలియగానే కంటెస్టెంట్లు ఎంతో ఎమోషనల్ అవుతూ తనను బయటకు పంపించారు.ఇక వేదిక పైకి వచ్చినటువంటి ఈమె నాగార్జునతో మాట్లాడుతూ ఇంత తొందరగా అభిమానులు తనని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపిస్తారని ఊహించలేదు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక వేదికపై నాగార్జున అభినయను ప్రశ్నిస్తూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఐదుగురు హానెస్ట్, ఐదుగురు హానెస్ట్ గా లేని వారి పేర్లను చెప్పమని సూచించారు.

Bigg Boss6: అతను చాలా కన్నింగ్…

హానెస్ట్ గా ఉన్న వారిలో చంటి, సూర్య, బాలాదిత్య, శ్రీ సత్య, ఫైమా పేర్లను సూచించగా హానెస్ట్ గా లేనటువంటి వారిలో కేవలం రేవంత్ పేరు మాత్రమే సూచించారు.
రేవంత్ ఆట మధ్యలో తన పర్సనల్ విషయాలన్నింటిని చెబుతారు ఆ విషయం నాకు నచ్చలేదు ఇలా అతను తన పర్సనల్ విషయాలు చెప్పడం చూస్తుంటే నాకు చాలా కన్నింగ్ అనిపించారు అంటూ అభినయ రేవంత్ పై తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇలా రేవంత్ గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago