V.N. Adithya : 2001 లో వచ్చిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో తొలిసారిగా డైరెక్టర్ గా హిట్ కొట్టాడు వి. ఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే సినిమా తరువాత మళ్ళీ ఉదయ్ కిరణ్ తోనే మరో సారి ‘శ్రీరామ్’ అనే సినిమా చేసి పర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ఒకేసారి ఆదిత్య కు చిరంజీవి, అలాగే నాగార్జున ఇద్దరి నుండి ఆఫర్ వచ్చింది. ఒకేసారి రెండు హ్యాండిల్ చేయడం కష్టమై ఇక చిరంజీవి సినిమా సరిగా రాకపోవడం వల్ల వదులుకున్నారు. ఇక నాగార్జున తో ‘నేనున్నాను’ సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ సినిమా సక్సెస్ తరువాత వి ఎన్ ఆదిత్య తీసిన మనసు మాట వినదు, బాస్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇక ఉదయ్ కిరణ్ తో రెండు సినిమాలకు పని చేసిన ఆదిత్య కు ఆయనతో మంచి సన్నిహిత్యం ఉండేది.
కో డైరెక్టర్ ను తిట్టాడు… చనిపోయే ముందు నాతో మాట్లాడాడు…
శ్రీ రామ్ సినిమా సమయంలో ఉదయ్ కిరణ్, అనిత మధ్య ఫారిన్ లో షూటింగ్ లో అనిత డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల బడ్జెట్ పెరుగుతుందని అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి షూటింగ్ చేస్తుండగా అప్పటికే మరో సినిమా విడుదల విషయంలో టెన్షన్ లో ఉన్న ఉదయ్ కిరణ్ సెట్ లో కో డైరెక్టర్ మీద అరిచేసాడు. కుక్కలాగా పని చేస్తున్నాను, ప్లాన్ చేసుకోవడం రాదా మీకు ఇంత సేపు వర్క్ చేయించుకుంటున్నారు అంటూ అరిచాడు. ఆ కో డైరెక్టర్ నాకు బాగా సన్నిహితుడు చాలా బాధగా అనిపించింది, ప్యాక్ అప్ చెప్పి వెళ్ళిపోయా. అయితే అలా ప్యాక్ అప్ చెప్పడం అదే తొలిసారి, అదే చివరిసారి అంటూ పంచుకున్నారు. ఇక ఉదయ్ కిరణ్ మరణం గురించి మాట్లాడుతూ ఉదయ్ తో మంచి అనుబంధం ఉండేది, మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా మళ్ళీ మేము మాట్లాడుకున్నాం.
తను 2014 జనవరి 5న మరణించారు అంతకుముందు జనవరి 1 న నాతో మూడు నాలుగు గంటలు మాట్లాడాడు. బెంగళూరు లో భార్య తో కలిసి పబ్ లో ఉండగా కాల్ చేసి మాట్లాడాడు. మీ భార్య తో ఉన్నారు ఇంత సేపు నాతో మాట్లాడితే తను ఏమనుకుంటుందో అంటే కూడా పర్వాలేదు తనకు తెలుసు అని చెప్పాడు. ఇక తనకి నేను ఎంత ధైర్యం ఇచ్చానో లేదో కానీ ఆ రోజు తన మాటలు నాలో చాలా పాజిటివిటీని నింపాయి. మనం మళ్ళీ పనిచేద్దాం కష్టపడదాం అంటూ అయన చెప్పిన మాటలు నాలో హోప్ ఇచ్చాయి కానీ తను నాలుగురోజులకు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదు అని బాధపడ్డారు ఆదిత్య.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…