Gummadi Jayavani : సినిమా ఇండస్ట్రీలో నీలదొక్కుకోవాలని చాలా మంది ఆశపడతారు. కొంతమందికి కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చి మంచి అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో స్థిరపడుతారు. మరి కొంతమందికి అలాంటి అవకాశం దొరకదు. అయితే కొంతమంది మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ కోవకే చెందుతారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి. గుంటూరు కి చెందిన గుమ్మడి జయవాణికి సినిమాలంటే పిచ్చి. చిన్నతనం నుండే సినిమా మీద ఆసక్తి తో అటు వైపు వెళ్లాలని అనుకునేది. ఇది గమనించిన పెద్దలు త్వరగా పెళ్లి చేసేసారు. అయితే భర్త సహకారంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది జయవాణి.
వేణు మాధవ్ ని కాలితో తన్ని తీసుకెళ్ళాను…
గుమ్మడి జయవాణి డిగ్రీ వరకు చదివి సినిమా ప్రయత్నాలు భర్త సహకారంతో చేసింది. అయితే మొదట సీరియల్ లో అవకాశాలు వచ్చాయి, ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన జయవాణి కి విక్రమార్కుడు సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత ఛత్రపతి, యమదొంగ సినిమాల ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. జయవాణికి కొన్ని పాత్రలు చేయడం అంత ఇష్టం లేక పోయినా ఇండస్ట్రీ లో గుర్తింపు రావాలని చేశారట. ప్రస్తుతం కేవలం కామెడీ పాత్రలను మాత్రమే చేయాలని జయవాణి అనుకుంటున్నారట. ఇక తాను నటించేటపుడు బాగా లీనమైపోతానంటూ తన అనుభవాలను చెప్పారు.
‘అదిరిందయ్య చంద్రం’ సినిమాలో నటించేటపుడు వేణు మాధవ్ గారు తాగి పడిపోతే వెళ్లి తీసుకుపోవాలి. ప్రాక్టీస్ చేసాక సీన్ చేసినపుడు వేణు మాధవ్ ను కాలితో తన్ని ఎక్కడబడితే అక్కడ తాగి పడిపోతావు అంటూ తిట్టి తీసుకెళ్ళాను. సీన్స్ అయ్యాక డైరెక్టర్ గారు ‘తన్నడం లేదు కదా, ఎందుకు అలా చేసావ్ వేణు మాధవ్ గారు వెళ్ళిపోతే ఏం చేసేది’ అని తల పట్టుకున్నారు కానీ వేణు మాధవ్ గారు వచ్చి లేదు చాలా బాగా చేసావ్ అని చెప్పారు అంటూ చెప్పి క్యారెక్టర్ లో లీనమైపోయి ఏం చేస్తానో తెలియదు, ఒక్కసారి ఇంట్లో కూడా అదే క్యారెక్టర్ లో ఉండిపోతాను అపుడు మా ఆయన సినిమా షూటింగ్ అయింది అని చెప్తుంటాడు, అని తన అనుభవాలను పంచుకుంది జయవాణి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…