Bigg Boss 7: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది.ఇప్పటివరకు ఆరో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుందంటూ మేకర్స్ లోగో ప్రోమో ద్వారా తెలియచేశారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ల పేర్లు వినిపించగా తాజాగా తెరపైకి ప్రముఖ యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బ్యాంకాక్ పిల్ల పేరు కూడా తెరపైకి వచ్చింది. బ్యాంకాక్ పిల్ల అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు శ్రావణి. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె బ్యాంకాక్ విశేషాలన్నింటిని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రావణి స్వస్థలం విజయవాడ. దీంతో ఈమె కూడా ఈ సీజన్లో పాల్గొనబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.. ఇందుకు అనుకూలంగానే శ్రావణి తన కుటుంబంతో కలిసి బ్యాంకాక్ నుంచి ఇండియాకు వచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం కోసమే ఈమె ఇండియా వచ్చారని ఇదే ప్రూఫ్ అంటూ మరికొందరు ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. ఈ విధంగా బ్యాంకాక్ పిల్ల బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…