Bigg Boss7:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఇప్పటికీ ఆరు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఏడవ సీజన్ కి సంబంధించి వరుస ప్రోమోలను విడుదల చేస్తూ ఈ షోపై భారీగానే అంచనాలను పెంచేశారు. అందరూ అనుకున్నట్టు ఈసారి ఈ కార్యక్రమం ఉండబోతుందని ఈసారి సరికొత్త రూల్స్ సరికొత్త గేమ్స్ అంటూ నాగార్జున ఈ కార్యక్రమం పై భారీ అంచనాలు పెంచేలా చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక ప్రోమో విడుదల చేశారు.
ది ఎండ్ అంటూ నాగార్జున మరొక కొత్త ప్రోమో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో భాగంగా ఓ వ్యక్తి కొండ నుంచి పడబోతూ ఉండగా తన ప్రియురాలు దుపట్టా ఇచ్చి తనని కాపాడుతుంది. ఇంతలోనే తనకు తుమ్ము రావడంతో దుపట్టా వదిలేస్తుంది అప్పుడు నాగార్జున ది అండ్ ఇలాంటి క్లైమాక్స్ లు మనం బోలెడు చూసాం అయితే ఈసారి సరికొత్తగా అంటూ ఇది అంతం కాదు ఆరంభం అంటూ బిగ్ బాస్ 7 గురించి తాజాగా విడుదలైన ఈ ప్రోమో మరిన్ని అంచనాలను పెంచేస్తుంది.
ఇక ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కాబోతుందని ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. అయితే ఈసారి ప్రేక్షకులకు పరిచయం లేనటువంటి మొహాలు కాకుండా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వారిని హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోయే కాంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు వినబడుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…