Saipallavi: సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా ఎంతో అద్భుతమైన నటన నాట్యంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె వచ్చిన అవకాశాలు అన్నింటిని వినియోగించుకోకుండా కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను అలాగే గ్లామర్ షో కి తావు లేకుండా ఉన్నటువంటి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు.
ఇలా సాయి పల్లవి నటించినది తక్కువ సినిమాలే ఆయనప్పటికీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి తన ఫేవరెట్ హీరో గురించి పలు విషయాలను తెలియజేశారు.
తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. అయితే ఇంటర్ చదువుతున్న సమయంలో తన సినిమా విడుదలయితే తన ఇంట్లో వారికి తెలియకుండా చూడటం కోసం వెళ్లానని తెలిపారు అయితే ఇంటికి చాలా ఆలస్యంగా రావడంతో తన తండ్రి చేతిలో బాగా తన్నులు తిన్నానని సాయి పల్లవి ఈ సందర్భంగా తెలిపారు. సినిమా చూడాలనిపిస్తే మాకు చెబితే మేమే తీసుకెళ్తాం కదా తిట్లు కూడా తిట్టారని సాయి పల్లవి తెలిపారు.
నాకెంతో ఇష్టమైన హీరో కోసం నేను చేసినటువంటి అతిపెద్ద రిస్క్ అదేనని ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గురించి సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని తాను మొదటిసారి ఫిదా సినిమా షూటింగ్ సమయంలో కలిశానని అదే తనని కలవడం మొదటి సారి, ఆయన ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…