Aadi Reddy: బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూలు ఆ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో ఆదిరెడ్డి ఒకరు. ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అనంతరం ఈయన కూడా సీజన్ సిక్స్ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత ఈయనకు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. ఇక ఏడవ సీజన్లో భాగంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమాలకు రివ్యూ ఇస్తూ నెలకి సుమారు 40 లక్షల వరకు ఆదాయం పొందారు అంటూ గత వీడియోలలో స్వయంగా ఆదిరెడ్డి తెలియజేశారు. ఇలా యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం పొందడంతో ఈయన బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే విజయవాడలో ఒక సెలూన్ షాప్ ప్రారంభించారు.
విజయవాడలో ప్రముఖ సెలూన్ కంపెనీ జావేద్ హబీబ్ బ్రాంచ్ తీసుకొని ప్రారంభించాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆయన చేతుల మీదుగా ఈ సెలూన్ ప్రారంభించారు. ఈ ఫోటోలను ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మీ చేతుల మీదుగా ఈ షాప్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు .
మరి కొంతమందికి ఉపాధి…
ఈ షాప్ ద్వారా తాను మరి కొంతమందికి ఉపాధి కల్పించాలని దాదాపు 15 మంది వరకు కూడా ఇక్కడ పనిచేయబోతున్నారు అంటూ ఈ సందర్భంగా ఆదిరెడ్డి షేర్ చేసినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదివరకు రాహుల్ బార్బర్గా పనిచేశాను అంటూ పలు సందర్భాలలో తెలియజేశారు. దీంతో ఈ సెలూన్ ప్రారంభించడానికి ఆయనని ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…