Featured

Kosaraju Adithya : 25 వేలు అడిగితే 5 వేలు చేతిలో పెట్టారు… అనుష్క రోజూ ఏనుగుతో మాట్లాడేది…: కోసరాజు ఆదిత్య

Kosaraju Adithya : సీనియర్ ఆర్టిస్ట్ గా, ఎన్నో సినిమాలలో సీరియల్స్ లలో నటించిన కోసరాజు ఆదిత్య మనందరికీ సుపరిచితమే. అయితే బాహుబలి సినిమాలో రాజగురువు పాత్రలో ఎక్కువగా అందరికీ గుర్తుండిపోయాడు. నటుడుగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆదిత్య గారు తనదైన ముద్ర వేసుకున్నారు. తన ముప్పైరెండేళ్ల సినీ ప్రయాణంలో చాలా సినిమాలలో సీరియల్స్ లో నటించినప్పటికీ ఎక్కువగా పంతులు పాత్రలే పోషించడం విశేషం.

రోజూ ఏనుగుతో అనుష్క ముచ్చట్లు…

ఇన్ని సంవత్సరాల తన సినీ ప్రయాణం గురించి, తన గురించి, బాహుబలి సినిమా సమయంలో తన అనుభవాల గురించి కోసరాజు ఆదిత్య గారు చాలా విషయాలు తెలియజేసారు. బాహుబలి సినిమా చేయటం తన అదృష్టం అని అయితే 25 వేలు రెమ్యూనరేషన్ అడిగితే రోజుకు 5 వేలు మాత్రమే ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. కానీ తన పాత్ర చాలా చిన్నది అనుకున్నా కానీ చాలా బాగా ఉందని, డబ్బుల గురించి ఆలోచించలేదని, రాజమౌళి లాంటి దర్శకుడితో అలాంటి నటీనటులతో పనిచేస్తే చాలు అనుకున్నాను అని తెలియజేసారు.

ఇక అనుష్క గురించి చెబుతూ చాలా మంచి అమ్మాయి అని, సెట్లో అందరినీ పేరు పేరునా పలకరిస్తుందని, తన పుట్టిన రోజు అయితే సెట్లో ఎంత మంది ఉన్నా అందరికీ భోజనం పెడుతుందని చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమా సెట్లో లక్ష్మి అనే ఏనుగు ఉండేదని, అనుష్క కి తనకి మంచి అనుబంధం ఉండేదని చెప్పారు. అనుష్క ఎంత దూరంలో ఉన్నా తను రాగానే ఆ ఏనుగు శబ్దంతో పలకరించేదని, ఇద్దరూ మాట్లాడుకునే వారని చెప్పారు. ఇక అనుష్క ఏనుగు తొండాన్ని గట్టిగా పట్టుకుంటే 5 నుండి 10 నిమిషాల వరకు కదలకుండా ఉండేదని చెప్పారు. ఇక ఏనుగు కోసం అనుష్క రోజూ అరిటి పళ్ళు దానికి కావలసిన ఆహారం తెచ్చేదని, వారిద్దరి అనుబంధం చూడటానికి బాగుండేదని చెప్పారు. ఇక రమ్యకృష్ణ గారి గురించి చెబుతూ చాలా హుందాగా ఉండేవారని, అపుడప్పుడు నాతో తమిళంలో మాట్లాడే వారని తన అనుభవాలను చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago