Categories: FeaturedMovie News

Roshan Kanakala : అమ్మ నాన్న విడాకులు… అత్త నన్ను ఎలా చూసుకునేవారు అంటే…: రోషన్ కనకాల

Roshan Kanakala : యాంకర్ సుమ, రాజీవ్ కనకాల వారసుడిగా రోషన్ కనకాల చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. రవికాంత్ దర్శకత్వంలో వస్తున్న ‘బబుల్‌గమ్’ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ ను రాజమౌళి గారు విడుదల చేయగా, హీరో నానీ టీజర్ ను విడుదల చేశారు. హీరోగా రోషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా ఇప్పటికే నిర్మలా కాన్వెంట్, నాగ శౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు సినిమాల ద్వారా తెర మీద కనిపించారు. ప్రస్తుతం రోషన్ బబుల్‌గమ్ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటున్నాడు.

అమ్మ నాన్న విడాకుల గురించి వారినే…

యాంకర్ సుమ, రాజీవ్ కనకాల విడాకుల గురించి దాదాపు గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి ఒక షోలో రోషన్ ను ప్రశ్నించగా ఆ వార్తను చూసి నేను కూడా ఆశ్చర్యపోయానని, ఇంట్లో నా కళ్ళ ముందే హ్యాపీగా ఉన్న వాళ్ళ గురించి విడాకులు తీసుకుంటున్నారు అని ఫోన్లో చూసి ఏంటిది ఇలా రాశారు అని డైరెక్ట్ గా వాళ్లనే ఒకసారి ఏంటి మీరు విడాకులు తీసుకుంటున్నారా అని అడిగానని, అందుకు వాళ్ళు అలాంటివి మామూలే పట్టించుకోకు అని అన్నారని చెప్పుకొచ్చారు.

ఇక రాజీవ్ కనకాల ఆయన సోదరి అయిన శ్రీలక్ష్మి కనకాల మధ్య మంచి అనుబంధం ఉండేది. శ్రీలక్ష్మి మరణం తరువాత చాలా సందర్భాలలో భావొద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. తన అత్త గారితో రోషన్ కు ఉన్న అనుబంధం గురించి చెబుతూ, తాను చిన్నప్పుడు ఇంకా అత్తకు పిల్లలు లేరని తనని చాలా గారాబం చేసేదని, తనకు పాప అంటే ఇష్టం కావడంతో తనను ఆలా రెడీ చేసేదని చెప్పారు. ఇక వారి మామ తనను బైక్ మీద తిప్పేవారని, ఇద్దరూ తనని బయటకు తీసుకెళ్ళేవారని చెప్పారు. వారికి పిల్లలు పుట్టాక కూడా నన్ను బాగా చూసుకునే వారని వారితో అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago