Roshan Kanakala : యాంకర్ సుమ, రాజీవ్ కనకాల వారసుడిగా రోషన్ కనకాల చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. రవికాంత్ దర్శకత్వంలో వస్తున్న ‘బబుల్గమ్’ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ ను రాజమౌళి గారు విడుదల చేయగా, హీరో నానీ టీజర్ ను విడుదల చేశారు. హీరోగా రోషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా ఇప్పటికే నిర్మలా కాన్వెంట్, నాగ శౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు సినిమాల ద్వారా తెర మీద కనిపించారు. ప్రస్తుతం రోషన్ బబుల్గమ్ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటున్నాడు.

అమ్మ నాన్న విడాకుల గురించి వారినే…
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల విడాకుల గురించి దాదాపు గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి ఒక షోలో రోషన్ ను ప్రశ్నించగా ఆ వార్తను చూసి నేను కూడా ఆశ్చర్యపోయానని, ఇంట్లో నా కళ్ళ ముందే హ్యాపీగా ఉన్న వాళ్ళ గురించి విడాకులు తీసుకుంటున్నారు అని ఫోన్లో చూసి ఏంటిది ఇలా రాశారు అని డైరెక్ట్ గా వాళ్లనే ఒకసారి ఏంటి మీరు విడాకులు తీసుకుంటున్నారా అని అడిగానని, అందుకు వాళ్ళు అలాంటివి మామూలే పట్టించుకోకు అని అన్నారని చెప్పుకొచ్చారు.

ఇక రాజీవ్ కనకాల ఆయన సోదరి అయిన శ్రీలక్ష్మి కనకాల మధ్య మంచి అనుబంధం ఉండేది. శ్రీలక్ష్మి మరణం తరువాత చాలా సందర్భాలలో భావొద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. తన అత్త గారితో రోషన్ కు ఉన్న అనుబంధం గురించి చెబుతూ, తాను చిన్నప్పుడు ఇంకా అత్తకు పిల్లలు లేరని తనని చాలా గారాబం చేసేదని, తనకు పాప అంటే ఇష్టం కావడంతో తనను ఆలా రెడీ చేసేదని చెప్పారు. ఇక వారి మామ తనను బైక్ మీద తిప్పేవారని, ఇద్దరూ తనని బయటకు తీసుకెళ్ళేవారని చెప్పారు. వారికి పిల్లలు పుట్టాక కూడా నన్ను బాగా చూసుకునే వారని వారితో అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.



























