Movie News

Bigg Boss Beauty: పీకల్లోతు కష్టాలలో బిగ్ బాస్ హాట్ బ్యూటీ! నెల గడవడమే కష్టంగా ఉందంటూ..

Bigg Boss Beauty: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నా రియాలిటీ షో లలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎంతోమంది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇలా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి ఇనయా సుల్తానా ఒకరు. చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఈమె నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలని భావించారు కానీ తన తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో తల్లిదండ్రులకు తెలియకుండా వంద రూపాయలు చేతిలో పట్టుకొని తన స్నేహితుల సహాయంతో తిరుపతి చేరుకున్నారు అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ తిరిగి హైదరాబాద్ చేరుకొని తన కలను సొంతం చేసుకున్నారు.

చిన్న చిన్న సినిమాలలో నటించిన ఇనయ సుల్తానా రాంగోపాల్ వర్మతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో కనిపించడంతో అందుకు సంబంధించిన వీడియోలు సంచలనంగా మారాయి ఈ వీడియో తర్వాత ఈమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో శివంగిలా చెలరేగిపోయి తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్ అనంతరం పెద్ద ఎత్తున వెబ్ సిరీస్ లలోను సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

గౌతమ్ అనే వ్యక్తిని పరిచయం చేస్తూ ఆయన తన ప్రియుడని ఆయన జిమ్ ట్రైనర్ అంటూ తన ప్రియుడి ఫోటోలను షేర్ చేశారు. ఇక అప్పటినుంచి తరచూ వీరిద్దరూ ఏకాంతంగా ఉన్నటువంటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెన్సేషనల్ గా నిలిచిన ఇనయా సుల్తానా తాజాగా జీవితం కష్టంగా ఉంది అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ… జీవితం చాలా కష్టంగా మారింది. అయినా నేను ఎంతో ధైర్యంగా ఉన్నానని తెలిపారు. జనవరి నెల నుండి ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నానని ఫిబ్రవరిని కూడా అదే విధంగా పూర్తి చేసుకుంటాను అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఇనయా సుల్తానా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

telugudesk

Recent Posts

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

9 minutes ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

37 minutes ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

43 minutes ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

46 minutes ago

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…

1 hour ago

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…

1 hour ago