Arjun Ambati: బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అర్జున్ అంబటి ఇటీవల బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు. ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి అర్జున్ ఫినాలే వరకు ఉన్నారు.
ఇక ఈయన బిగ్ బాస్ హౌస్ లో కొనసాగే సమయంలో ఆయన సతీమణి సురేఖ ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లో భాగంగా సురేఖ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఈ విషయం బయటపడింది. అంతేకాకుండా బిగ్ బాస్ ఈమెకు ఘనంగా తన భర్త చేతుల మీదుగా సీమంతపు వేడుకలను కూడా జరిపించారు.
ఇకపోతే తాజాగా అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభవార్తను తెలియజేశారు తనకు పాప పుట్టిందనీ ఈయన తెలియజేశారు అంతేకాకుండా పాపకు అర్క అనే పేరును కూడా పెట్టినట్టు అర్జున్ వెల్లడించారు. తన కుమార్తెకు తన భార్య తన ఇద్దరి పేర్లను కలిపి పెట్టినట్లు తెలుస్తోంది. అర్జున్ పేరు నుంచి Ar అక్షరాలను తీసుకొని తన భార్య సురేఖ పేరు నుంచి kha అనే అక్షరాలను తీసుకొని తన కుమార్తెకు Arkha అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.
అర్క..
ఈ విధంగా అర్జున్ తనకు కుమార్తె పుట్టింది అనే విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఎంతోమంది బుల్లితెర నటీనటులు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అభిమానులు సైతం ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…