Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు. ఈయన కెరియర్ మొదట్లో జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ప్రస్తుతం సుధీర్ ఎంతో బిజీగా ఉన్నారు.
సుడిగాలి సుదీర్ ఇప్పటికే పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ఈయన కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుత కాలంలో యంగ్ హీరోస్ అందరూ కూడా హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్ చేస్తున్న సంగతి మనకు తెలుసు. కానీ సుదీర్ మాత్రం ఇప్పటివరకు తన సినిమాలలో హీరోయిన్లతో అలా నటించలేదు.
ఇలా సుధీర్ హీరోయిన్లతో లిప్ లాక్ సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలలో నటించకపోవడానికి గల కారణాలను ఈయన ఒక సందర్భంలో తెలియజేశారు. తాను జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగే సమయంలో తన స్కిట్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చూసేవారు ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను అంటే చాలామంది ఫ్యామిలీతో కలిసి నా సినిమాలను చూస్తారు.
అమ్మాయిలు అంటే గౌరవం..
ఇలా ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే సమయంలో నేను ఇలాంటి సన్నివేశాలలో నటిస్తే బాగోదని అందుకే ఈ విషయాల గురించి డైరెక్టర్లకు ముందుగానే చెబుతూ ఉంటానని సుదీర్ వెల్లడించారు. అంతే కాకుండా నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం ఉందని అందుకే తాను అలాంటి సన్నివేశాలలో నటించకూడదు అనే నియమం పెట్టుకున్నాను అంటూ సుధీర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…