బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంటర్ టైనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన లోబో తన కామెడీని మాత్రం పండించలేకపోతున్నాడు. ఆరోవారం డబుల్ ఎలిమినేషన్ అంటూ శ్వేతను ఇంటికి పంపి.. లోబోను ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూంలో ఉంచాడు. కానీ లోబో సీక్రెట్ రూంలో ఉంచడం నెటిజన్లకు అస్సలు నచ్చడం లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్ ను అర్థరాత్రి అందరినీ నిద్ర లేపి సీక్రెట్ రూంకి పంపించారు.
అందులో అభిజిత్ ను టార్గెట్ చేసి పులి, మేక అనే ఎపిసోడ్ ను పండించడంలో బిగ్ బాస్ విజయవంతం అయ్యాడు. కానీ లోబో విషయంలో అలా జరగడం లేదు. లోబో ద్వారా బిగ్ బాస్ ఏమైనా రాబట్టాలని చూస్తున్నాడా.. లేదా లోబోను ఇంకాస్త ఎంటర్ టైన్ చేసే విధంగా ట్రైన్ చేస్తున్నాడా అనేది అర్థం కావట్లేదు.
ఇక లోబో మాత్రం నిన్నటి ఎపిసోడ్ లో వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు కానీ.. ఎలాంటి స్పందన లేదు. ఎలాంటి ఉలుకు లేదు.. పలుకు లేదు. దీంతో నెటిజన్లకు చిర్రెత్తిపోతోంది. అస్సలు సీక్రెట్ రూంలోకి లోబోను ఎందుకు పంపించారో అర్థం అవ్వట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో లోబో మాటలను బట్టి చూస్తే.. అతడు బయటకు వెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నట్లు అర్థం అవుతుంది.
ఏదేమైనా లోబో తన టాలెంట్ కు తగ్గట్లు ప్రవర్తించడం లేదనేది తెలుస్తోంది. దానికి వ్యక్తిగంతంగా కొన్ని బాధలు కూడా అయి ఉండవచ్చు. తన భార్య ప్రెగ్నెన్సీ అని చాలాసార్లు చెప్పాడు.. బహుషా అతడికి అది మైండ్ లో బాగా ఆడుతున్నట్లు ఉంది. ఏదేమైనా లోబో సీక్రెట్ రూం ప్లాన్ అట్టర్ ప్లాప్ అయినట్లు కనిపిస్తోంది. అతడికి బదులు వేరే వాళ్లను సీక్రెట్ రూంకి పంపించినట్లయితే బాగుండనేది నెటిజన్ల అభిప్రాయం.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…