Bigg Boss Season 6: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లు వీళ్లే.. సోషల్ మీడియాలో వైరల్!
Bigg Boss Season 6: తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే రియాల్టీ షోల్లో ఎక్కువగా బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ మరే షోకు ఉండదు. అందులోకి వెళ్లి పార్టిసిపేట్ చేసిన ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చిన తర్వాత విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటారు. ఇలా ప్రతీ సీజన్లో కూడా జరిగింది.
తెలుగులో మొత్తం ఇప్పటి వరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ ఐదు సీజన్ల వరకు స్టార్ మాలో ప్రసారం చేశారు. కానీ ఈ సారి ప్రసారం అయ్యే సీజన్ 6 కు సంబంధించి మొదటి నుంచి అనుకున్నట్లే.. ఓటీటీలో ప్రసారం చేయనున్నారని.
మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్ కు నానీ.. మూడో సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా చేసి.. బెస్ట్ హోస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే సీజన్ 6కు మొదట బాలయ్య అనుకున్నా.. దానికి నాగార్జున స్వయంగా సమాధానం చెప్పాడు. సీజన్ 6 కు కూడా తానే హోస్ట్ గా వ్యవహరిస్తానన్నాడు. దీంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
ఇక సీజన్ 5లో 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. సీజన్ 6లో అంతమంది ఉండకపోవచ్చనేది తెలుస్తోంది. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కొన్ని వినిపిస్తున్నాయి. ఈ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీజన్ 6లో పాల్గొనేవారు ఎవరంటే.. మొదటగా ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో.. యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాంకర్ ప్రత్యూష. వీళ్ల పేర్లు ప్రస్తుతం ఫైనల్ అయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…