Samantha – Naga Chaitanya: సమంత, నాగచైతన్య వ్యవహారం ఒడవని ముచ్చటగా మారిపోయింది. ఎక్కడ చూసినా.. ప్రతీ రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తెగర వైరల్ అవుతుంటాయి. వాళ్లు విడాకులు తీసుకొని దాదాపు మూడు నెలలు పూర్తి అయింది. అధికారికంగా వారిద్దరు ప్రకటించుకున్నారు కనుక ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు.
కానీ చట్ట ప్రకారం మాత్రం వాళ్లకు ఇంకా విడాకుల పత్రాలు మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా.. సమంత, నాగచైతన్యల విషయానికి వస్తే నాగచైతన్య సున్నితమైన మనస్తత్వం కలవాడు. ఎవరినీ నొప్పించడు. ఏం జరిగినా తనలో తానే కుమిలిపోతుంటాడు. విడాకుల ప్రకటన తర్వాతా అతడు దాదాపు మూడు వారాల పాటు.. ఇంట్లోనే ఉండి..ఎంతో కుమిలిపోయినట్లుగా తెలుస్తోంది.
ఆ మూడు వారాలు మీడియా ముందుకు కూడా రాలేదు. అయితే ప్రస్తుతం నాగచైతన్య, సమంత మళ్లీ ఒకటవుతారనే వార్తలు వస్తున్నాయి. ఎలా అంటే దీనికి ఒక ఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇటీవల చైతూ..విడాకులు తీసకున్నందుకు సారీ ఆంటీ అంటూ.. సమంత తల్లికి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడట.
సమంత తల్లి చైతూను.. ఒక కొడుకులాగే ట్రీట్ చేసేదట. అందుకే అత్తకు ఫోన్ చేసి విడాకుల విషయం చెప్పి.. క్షమాపణలు కోరాడని తెలుస్తోంది. ఒక వేళ సమంత మళ్లీ వస్తే.. కలిసేందుకు నాగచైతన్య ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే ఇది నిజం కాకుండా ఉండటానికే ఎక్కువగా అవకాశం ఉంది.. ఎందుకంటే.. సమంతపై నాగచైతన్యకు ఇప్పటికే ప్రేమ అంతా చచ్చిపోయింది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత కూడా.. కాస్త స్కిన్ షో ఉన్న సినిమాలు చేయడం మొదలు పెట్టింది. దీంతో అతడికి ఆమెపై ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా పోయిందనేది తెలుస్తోంది. కనుక ఇలా చర్చించుకోవడం అనేది వృదా అన్నట్లుగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. ఏదేమైనా సమంత, నాగచైతన్య విడాకుల ప్రస్తావన చాలామంది అభిమానులకు షాక్ ఇచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…