Bigg Boss Sohel: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సోహైల్ ఒకరు. బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ త్రీ కంటెంట్ గా నిలిచిన సోహైల్ ఈ కార్యక్రమం తర్వాత ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే ఈయన హీరోగా నటించిన లక్కీ లక్ష్మణ్ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన గురించి ట్రోల్ చేసినటువంటి వారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.
తాను బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా 25 లక్షల తీసుకొని బయటకు రావడంతో తన గురించి తన ఫ్యామిలీ గురించి దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారని అయితే నేను ఏ పొజిషన్లో ఆ డబ్బు తీసుకోవాల్సి వచ్చిందో తెలిస్తే ఎవరూ కూడా అలా మాట్లాడరని తెలిపారు.ఆరోజు నేను ఆ డబ్బు తీసుకోవడానికి ఓ కారణము ఉంది ఆ సమయంలో నాకు డబ్బు ఎంతో అవసరం ఆ డబ్బుతో నేను నా చెల్లెలి పెళ్లి చేశానని తెలిపారు.
ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అన్నయ్యగా ఒక చెల్లెలు పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడాలో అందరికీ తెలిసిందే.కానీ నేను మోసం చేసి డబ్బు తీసుకున్నానని నా ఫ్యామిలీ గురించి చాలామంది ట్రోల్ చేశారు. ఇకపై నా గురించి గానీ నా ఫ్యామిలీ గురించి గానీ ఇలాంటి ట్రోల్స్ చేస్తే ఎక్కడున్నా సరే వెతికి వచ్చి మరీ కొడతాను అంటూ సోహైల్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సోహైల్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…