Movie News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాలయ్య షోలో ధరించిన హుడి ధర ఎంతో తెలుసా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారని తెలియడంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు వేయనున్నారు. వాటికి పవన్ సమాధానం ఏంటి అనే ప్రశ్నలు అందరిలోనూ నెలకొన్నాయి. ఇక ఈ కార్యక్రమం కోసం సినీ అభిమానులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇలా ఈ కార్యక్రమం పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ధరించిన డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం కోసం బాలకృష్ణ బ్లాక్ హుడి ధరించి ఎంతో స్టైలిష్ లుక్ లో సందడి చేశారు. ఈ క్రమంలోనే పవన్ ధరించిన ఈ హుడి ఖరీదు ఎంత ఉంటుంది అని నెటిజన్స్, ఫాన్స్ పవన్ డ్రెస్ గురించి ఆరా తీస్తున్నారు.

Pawan Kalyan: సంక్రాంతి కానుకగా ప్రసారం కానున్న పవన్ ఎపిసోడ్…

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ధరించిన ఈ బ్లాక్ హుడి
హ్యూగో బాస్ కంపెనీకి చెందింది. దీని ధర విదేశాల్లో అయితే 245 డాలర్లుగా ఉంది. ఇది మన భారతీయ మార్కెట్ లో రూ.20 వేల నుంచి రూ.27 వేల వరకు ఉంటుందని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్య పోతున్నారు. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago