బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్వేతా వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదు వారాలకు ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. బిగ్ బాస్ 19మందిలో ఈమె కూడా ఒకరు .ఈమె ఎవరు ఉహించని ఈ విధంగా అనూహ్యంగా బయటకు వచ్చేసింది. అగ్రెస్సివ్ నేచర్ తో తన మార్కు గేమ్ చూపించిన శ్వేత అనూహ్యంగా ఎలిమినేట్ కావడం జరిగింది.
అయితే సీత వర్మ బిగ్ బాస్ టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటుంది అనీ అనుకున్నారు.అయినప్పటికీ ఈ షో ద్వారా శ్వేతా వర్మ కొంత ఫేమ్ రాబట్టారు. తన అభిమానులను పెంచుకున్నారు. పలు సినిమాలు, సిరీస్ లలో నటించినా రాని గుర్తింపు, బిగ్ బాస్ షోద్వారా దక్కింది. దీంతో ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.తాజాగా శ్వేత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలోనే శ్వేతా వర్మ క్యాస్టింగ్ కౌచ్ పై పలు ఆసక్తికర వాఖ్యలు చేసింది.సిని పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె కుండబద్దలు కొట్టారు.ఈ క్రమంలోనే శ్వేత వర్మకు కు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు.2013లో నేను షార్ట్ ఫిలిమ్స్ తో నటిస్తున్నాను. పేస్ బుక్ లో ఒక డైరెక్టర్ ఛాట్ చేశారు. ఆ కన్వర్సేషన్ లో అతడు కమిట్మెంట్ ఇవ్వాలి అన్నాడు.
కమిట్మెంట్ అంటే, హార్డ్ వర్క్ చేయాలని, అడుగుతున్నాడని అనుకున్నాను. తర్వాత అతను లక్ష రూపాయలు ఇస్తాను వస్తావా అని అడిగారు. ఆ ఛాట్ స్క్రీన్ షాట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది. నా కోసం కూడా ఒకటి చేస్తారా.అని అడిగాను. ఏమిటని అతను అనగానే, పెద్ద బిల్డింగ్ పై నుండి దూకేయండి, అని సమాధానం చెప్పాను అనీ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…