దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ లు, సాంగ్ లు రిలీజ్ చేయగా ఇవి మంచి ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సామీ సాంగ్ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా ఇదే పాట వినిపిస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న ఈ సినిమాను, రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్టు పార్టుకు సంబంధించి షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది. మిగిలిన 10 శాతం చిత్రీకరణను పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం.ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.ఆయన ఫస్టులుక్ కు ఏ విధమైన రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే.అయితే ఆయన ఫస్టు పార్టు చివరలో, కథ పతాకస్థాయికి చేరుకుంటున్న సమయంలో తెరపై ప్రత్యక్షమవుతాడట సెకండ్ పార్టు కోసం వెయిట్ చేసేలా చేస్తారని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమా ఫస్టు పార్టులో సునీల్ విలన్‌గా కనిపించనున్నాడట.ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప చిత్రంలో తన రోల్ గురించి తెలిపాడు సునీల్.ఇందులో తనకుమంచి పాత్ర దొరికిందని అన్నాడు.రామ్ చరణ్ సినిమాతో పాటు గా మంచి పాత్రలు తనకు దొరుకుతున్నాయని తెలిపారు.ఇక సునీల్ రీసెంట్‌గా హెడ్స్ అండ్ టేల్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సునీల్, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హెడ్స్ అండ్ టేల్స్,‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఈ సినిమాకు నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ 5 లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…