Movie News

పునీత్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా?

కన్నడ పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు. ఆయన గుండెపోటుతో నేడు మరణించడంతో ఈ వార్తను అభిమానులు, సినీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు సినీ నటులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా పునీత్ తన అద్భుతమైన నటనతో విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకొని కన్నడనాట సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే నటుడు పునీత్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఈయనను ఇండస్ట్రీకి పరిచయం చేసినది డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని చెప్పాలి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు ఎలాగో కన్నడ సినీ పరిశ్రమకు నటుడు రాజ్ కుమార్ అలాగా. ఆయన వారసుడిగా పునీత్ రాజ్ కుమార్ ను ఇండస్ట్రీలోకి ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేయవచ్చు. కానీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయించారు.
పూరి జగన్నాథ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాలో చూసిన రాజ్ కుమార్ ఎంతో ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమా తర్వాత తన కుమారుడిని పూరీ జగన్నాథ్ తో లాంచ్ చేయాలని భావించారట. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పునీత్ డెబ్యూ మూవీగా “అప్పు” అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కన్నడనాట ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ చిత్రంగా నిలిచింది.

ఇక అప్పు సినిమా తర్వాత దీనిని తెలుగులో రీమేక్ చేసి పూరీజగన్నాథ్ ఇడియట్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా తెలుగులో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పునీత్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కలవాడు.స్టార్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు తను ఎప్పటికీ శిష్యుడేనని ఎన్నోమార్లు వెల్లడించారు. ఇలా స్టార్ హీరోగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ మరణించడంతో పలువురు తెలుగు నటీనటులు కూడా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago